• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మద్యనిషేధానికి జగన్ స్ట్రాటజీ.. మందుబాబులను కంట్రోల్ చేసే నిర్ణయాలతో సర్కార్ బిజీ

|

మద్యనిషేధానికి ఏపీ సీఎం జగన్ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. జగన్ వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్యపాన నిషేధంపై మరో అడుగు ముందుకేశారు . అందుకే కొత్త మద్యం పాలసీని అందుబాటులోకి తెస్తున్న ఆయన తాజాగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక తాము అధికారంలోకి వస్తే దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన జగన్ ఆ దిశగా దశల వారీగా చర్యలు చేపట్టారు. ఇప్పుడు పరిమితి విధించి మందుబాబులకు షాక్ ఇచ్చింది. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం మందుబాబులకు మింగుడు పడటం లేదు . అయినా చాలా వ్యూహాత్మకంగా జగన్ సర్కార్ పలు దఫాలుగా వేస్తున్న స్టెప్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి .

మద్య నిషేదానికి ఒక్కో అడుగు వేస్తున్న జగన్ ప్రభుత్వం

మద్య నిషేదానికి ఒక్కో అడుగు వేస్తున్న జగన్ ప్రభుత్వం

మద్యపాన నిషేధం అమలులో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ ముందు బెల్ట్ షాపులకు చెక్ పెట్టి , ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించాలని నిర్ణయించారు . ఇక సెప్టెంబర్ 1 నుండి కొత్త మద్యం పాలసీ అమలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం షాపుల నిర్వహణ ప్రారంభించారు. ఇప్పుడు తాజాగా వ్యక్తిగత మద్యం నిల్వలపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు . ఇప్పటికే రాష్ట్రంలో బెల్టు షాపులపై ఉక్కు పాదం మోపారు . మద్యం విక్రయ వేళలను కూడా నిర్ణయించి సమయం దాటాక ఎవరూ మద్యం విక్రయించకుండా చర్యలు తీసుకుంటున్నారు . దీంతో కొంత అర్దరాత్రి సమయాల్లో దొంగచాటు మద్యం విక్రయాలకు చెక్ పడింది. దీంతో కాసింత నిరాశ చెందినా మందుబాబులు సమయపాలన అలవాటు చేసుకున్నారు.

వరుస షాక్ లు.. వ్యక్తిగత మద్యం నిల్వలపై పరిమితి

వరుస షాక్ లు.. వ్యక్తిగత మద్యం నిల్వలపై పరిమితి

ఎమ్మార్పీ ధరల ఉల్లంఘన జరగకుండా ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకే మద్యం అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకుంది . అందులో భాగంగా ప్రభుత్వమే మద్యం వికరయాలకు రంగంలోకి దిగింది. ప్రతిపక్ష పార్టీలు విమర్శించినా ప్రభుత్వమే విక్రయించటం మద్యం వికర్యాల అవకతవకలకు చెక్ పెట్టటానికే అని అర్ధం అవుతుంది. ఒక వ్యక్తి దగ్గర ఆరు బాటిళ్లు ఉండొచ్చన్న నిబంధన రద్దు చేసి దానిని మూడు బాటిళ్లకు తగ్గించి మరో షాక్ ఇచ్చింది . వ్యక్తిగత మద్యం నిల్వలకు కూడా పరిమితి విధించింది. జగన్ సర్కార్ ఒక్కసారిగా కాకుండా దశల వారీగా మద్యం విషయంలో కఠిన నిర్ణయాలను అమలు చెయ్యటానికి చూస్తుంది. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

లిక్కర్‌పై పరిమితి విధిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

లిక్కర్‌పై పరిమితి విధిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

ఇక ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించే ఆలోచన కూడా ఇష్టారాజ్యంగా లిక్కర్ షాపులు నిర్వహించకుండా ఉండేందుకే అని స్పష్టంగా చెప్పింది ప్రభుత్వం . అక్టోబర్‌ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 3000 మద్యం దుకాణాలు సర్కారు ఆధ్వర్యంలోనే నిర్వహించటానికి కసరత్తు చేస్తుంది .మద్యం విక్రయానికి పరిమితులు విధించిన జగన్ ప్రభుత్వం పర్మిట్, లైసెన్స్ లేకుండా ఒక వ్యక్తి కలిగివుండే లిక్కర్‌పై పరిమితి విధిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. దేశీయంగా తయారయ్యే, విదేశీ మద్యం 3 సీసాలు, బీరు 6 సీసాలు, కల్లు 2 బల్క లీటర్లు, మితలేటెడ్ స్పిరిట్ 3 బల్క లీటర్లు, అమ్మాలని ప్రభుత్వం పేర్కొంది. ఇది మందుబాబులకు అసలు నచ్చని అంశం అయినా పెద్దగా పట్టింపు లేదు .

మందుబాబులను కంట్రోల్ లోకి తెచ్చే క్రమంలో జగన్ ప్రభుత్వం

మందుబాబులను కంట్రోల్ లోకి తెచ్చే క్రమంలో జగన్ ప్రభుత్వం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కల సాకారం చేసే దిశగా ఎక్సైజ్‌ శాఖ కూడా అడుగులు వేస్తుంది. ఒక్కో వ్యక్తి వద్ద మద్యం బాటిల్స్ అయితే 3, బీర్ బాటిల్స్ అయితే 6 కంటే మించి ఉండవద్దని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అంతేకాదు నూతన మద్యం పాలసీ విధానాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలుచేస్తోంది. ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించటంతో పాటు ప్రతి మద్యం షాపు దగ్గర ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్‌ను నియమించనుంది. మొత్తానికి వ్యక్తిగత మద్యం పరిమితిని విధించి మందుబాబులకు షాక్ ఇచ్చింది. ఒకేసారి మద్యం బ్యాన్ చేస్తే పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే ప్రమాదం వుంటుంది. అందుకే ఇలా కొద్దిపాటి డోస్ లతో మద్య నిషేధం విషయంలో మందుబాబులకు కంట్రోల్ లోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jagan government has issued jurisdiction to limit the sale of liquor to a licensed permit holder and license holder. The government said it would sell 3 bottles of domestic liquor, 3 bottles of foreign liquor, 6 bottles of beer, 2 bulk liters of liquor, 3 liters of methylated spirit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more