ముప్పై ఏళ్ళుగా టీడీపీ చేతిలో ఉన్న విశాఖ డైరీ ఇక వైసీపీ గుప్పెట్లోకి ... ఎందుకంటే
ముప్పై ఏళ్ళుగా టీడీపీ గుప్పట్లో ఉన్న విశాఖ డైరీ ఇక వైసీపీ చేతిలోకి మారనుంది. అందుకు కారణం విశాఖ డెయిరీ చైర్మన్ అడారి ఆనంద్, తన 12 మంది డైరెక్టర్లతో కూడిన బృందం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకుని చంద్రబాబుకు షాక్ ఇచ్చారు . ఈ నిర్ణయంతో ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.

టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరనున్న విశాఖ డైరీ చైర్మన్ అడారీ ఆనంద్
సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన అడారీ ఆనంద్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీలోకి చేరనున్నారు. ఇక ఆయన విషయానికి వస్తే విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు కుమారుడు ఆనంద్. ఈయన డైరీ అనుబంధ కృషి ట్రస్ట్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికల్లో అనకాపల్లి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఆనంద్ పోటీ చేశారు ఆనంద్ . వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ బి.వెంకటసత్యవతి పోటీ చేశారు. ఆనంద్‌పై సత్యవతి ఊహించని విజయాన్ని నమోదు చేసుకున్నారు . ఆడారి ఆనంద్‌కు 2,74,793 ఓట్లు పోలవగా, వైసీపీ అభ్యర్థిని సత్యవతికి 3,32,970ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆమె టీడీపీ అభ్యర్థి ఆనంద్‌పై 58,177 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు .

ఆనంద్‌తో పాటు 12 మంది విశాఖ డైరీ డైరెక్టర్లు
ఆనంద్ బరిలో నిలిచినప్పటి నుంచి విశాఖ డెయిరీ నిర్వాహకులే అన్నినియోజకవర్గాల్లోనూ వ్యూహాలు రచించి ఎంతగానో కృషి చేశారు . ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ పాడి రైతులు, టీడీపీ కార్యకర్తల ఓట్లతో పాటు క్రాస్ ఓటింగ్ తమకు కలిసి వస్తుందని భావించారు . కానీ ఆ పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. వైసీపీ దెబ్బకు ఆనంద్ ఓటమిపాలయ్యారు. ఇక టీడీపీ ఓటమి తర్వాత తాజా రాజకీయ పరిణామాల నేపధ్యలో ఆయన తో పాటు విశాఖ డైరీ డైరెక్టర్స్ 12 మంది , మరియు యలమంచిలి మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ రమాకుమారితో పాటు పలువురు టీడీపీ నేతలు వైసీపీ గూటికి చేరనున్నారు.ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు.

సెప్టెంబర్ 1న జగన్ సమక్షంలో వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారు
సెప్టెంబర్ 1న విజయవాడలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఆనంద్ వైఎస్సార్‌సీపీలో చేరటానికి అడారి ఆనంద్ సిద్ధం అవుతున్నారు . వీరి చేరికతో సుమారు మూడు దశాబ్ధాలుగా టీడీపీ చేతిలో ఉన్న విశాఖ డైరీ ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లనుంది . దీంతో ఇంతకాలం టీడీపీ సానుభూతిపరుల చెప్పుచేతుల్లో ఉన్న ఉత్తరాంధ్రలోని పాల సొసైటీలు సైతం వై సీపీ అండర్ లోకి వెళ్లనున్నాయి. వైఎస్‌ఆర్‌సిపి చీఫ్,ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయనతో పాటు విశాఖ డైరీ డైరెక్టర్స్ అందరూ వైసీపీలో చేరనున్నారు. ఇక జిల్లాలో టిడిపి స్ట్రాంగ్‌మన్‌గా పరిగణించబడిన అడారీ తులసి రావు కుమారుడు ఆనంద్ పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో ఆయన మాట్లాడుతూ , పాడి పరిశ్రమతో సంబంధం ఉన్న రైతులు కూడా త్వరలో వైఎస్‌ఆర్‌సిపిలో చేరనున్నారని ప్రకటన చేశారు. దీంతో చంద్రబాబుకు ఉత్తరంధ్రాలో ఊహించని షాక్ తగిలింది.












Click it and Unblock the Notifications