జగన్ తప్పు ఒప్పుకున్నట్లే-కొత్త బిల్లుతో మరింత గందరగోళం-పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కామెంట్స్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల బిల్లుల రద్దు నిర్ణయంపై టీడీపీ నేతలు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. ఇదే క్రమంలో పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కూడా దీనిపై తన అభిప్రాయం తెలిపారు. జగన్ తాజా నిర్ణయంతో తన తప్పు ఒప్పుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ఏపీలో మూడు రాజధానుల రద్దు నిర్ణయం మరింత అనిశ్చితికి దారి తీస్తుందని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ హెచ్చరించారు. మళ్ళీ మెరుగైన బిల్లు అంటూ సీఎం చేసిన ప్రకటన తో మరింత అనిశ్చితి నెలకొంటుందన్నారు. కోర్ట్ లో వాదనలు కొలిక్కి వస్తున్నాయని, తీర్పు వచ్చే సమయం దగ్గర పడిందని కేశవ్ గుర్తుచేశారు. అన్ని లెక్కలు వేసుకునే ఈ సమయం లో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని పయ్యావుల వ్యాఖ్యానించారు.

మరోవైపు వైసీపీ సర్కార్ మూడు రాజధానులపై మరో కొత్త బిల్లు తీసుకొస్తామని చెప్పడంపైనా పయ్యావుల స్పందించారు.
మెరుగైన బిల్లు అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలతో మరింత గందరగోళం తప్పదన్నారు. మూడు రాజధానులు అనాలోచిత నిర్ణయానికి బాద్యులు ఎవరని సీఎం జగన్ ను పయ్యావుల ప్రశ్నించారు. ఇప్పటి వరకు జరిగిన నష్టానికి ఎవరు సమాధానం చెపుతారని నిలదీశారు. గతంలో వైసీపీ సర్కార్ చేసిన చట్టాలు తప్పు అని సీఎం జగన్ అంగీకరించినట్లేనని పయ్యావుల పేర్కొన్నారు.
ఇప్పటికే వైసీపీ సర్కార్ మూడు రాజధానుల ఏర్పాటు పేరుతో పలు తప్పిదాలు చేసిందని, ఇప్పుడు కొత్త బిల్లు పేరుతో మరింత గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని పయ్యావుల ఆరోపించారు. ఇలాంటి తప్పిదాల వల్ల రాష్ట్ర భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు.












Click it and Unblock the Notifications