పవన్ కళ్యాణ్ సెలబ్రిటీ అంటూ.. పిఠాపురం ఫలితాలపై వంగా గీత షాకింగ్ ఆడియో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ జూన్ 4వ తేదీన కొనసాగనుంది. ఇక ఏపీలో ఎన్నికల కౌంటింగ్ లో ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీ పరాజయం పాలవుతుంది? అన్నది ఏపీ వ్యాప్తంగానే కాదు ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ ఆసక్తిని కలిగిస్తుంది. ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పిఠాపురం నియోజకవర్గంలో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఉత్కంఠను రేకెత్తిస్తుంది.

వంగా గీత ఆడియో వైరల్
ఇప్పటికే టిడిపి కూటమినేతలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో లక్ష మెజారిటీతో విజయం సాధిస్తారని, ఈసారి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ నిలుస్తాడని చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన వంగా గీత మాట్లాడిన ఒక ఆడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Pawan Kalyan is a Celebrity Vanga Geetha Shocking Audio on Pithapuram Results

పవన్ కళ్యాణ్ గురించి వంగా గీత షాకింగ్ ఆడియో
ఈ ఆడియోలో వంగా గీత పవన్ కళ్యాణ్ ఒక సెలబ్రిటీ అని, ఒక పార్టీ ప్రెసిడెంట్ అని చెబుతూ, ఆయన కోసం అందరూ వచ్చి ఎన్నికల ప్రచారం చేశారని, పవన్ కళ్యాణ్ కు ఎన్నికల్లో 80000 నుంచి 90000 ఓట్లు వచ్చే అవకాశం ఉందని తన అంచనాగా చెప్పారు. వంగా గీత చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వంగా గీత ఆడియో షేర్ చేస్తున్న జన సైనికులు
ఇక వంగా గీత మాట్లాడినట్టు ఆ ఆడియోను పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ కు 80 వేల నుంచి 90000 మెజారిటీ వస్తుందని వంగా గీత నే చెప్పారని, వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ తూర్పు తిరిగి దండం పెట్టుకోండి అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

అయితే వంగా గీత వ్యాఖ్యల అర్ధం ఇదే అంటున్న వైసీపీ
అయితే వంగ గీత కేవలం 80000 నుంచి 90000 ఓట్లు వస్తాయని చెప్పారని, పవన్ కళ్యాణ్ కి వచ్చే మెజారిటీ కాదని ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓటమి ఖాయం అంటూ వంగా గీత అభిమానులు, వైసిపి అభిమానులు ఈ పోస్టులకు కౌంటర్ ఇస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఎన్నికలు ప్రారంభమైన నాటి నుండి ఫేక్ ఆడియోలు, వీడియోలు వైరల్ అవుతున్న క్రమంలో ఈ ఆడియోపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇప్పుడు రాష్ట్రం దృష్టి పిఠాపురం పైనే
వంగా గీత పేరుతో వైరల్ అవుతున్న ఈ ఆడియో నిజమా లేక డీప్ ఫేక్ నా అన్న చర్చ జరుగుతుంది. ఇది ఫేక్ అనుకుంటా అని కొందరు నెటిజెన్లు స్పందిస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి పిఠాపురం పైన నెలకొంది. పిఠాపురంలో విజయం వంగా గీతదా... లేక పవన్ కళ్యాణ్ దా అన్నది రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+