తుఫాను దూసుకొస్తోంది- ఈ జిల్లాలపై తీవ్ర ప్రభావం, ప్రభుత్వం కీలక సూచనలు..!!
మురసు తుఫాను దూసుకొస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మురసు తుపాను తీవ్ర తుపానుగా బలపడింది. గత ఆరు గంటల్లో గంటకు 22 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ తుపాను, సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము మధ్య నెల్లూరు-నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీంతో, ప్రభుత్వం యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. కీలక ఆదేశాలు ఇచ్చింది.
మురసు' తుఫాన్ నేపథ్యంలో అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించి కీలక సూచనలు చేసారు. మురసు తుఫాన్ పట్ల అప్రమత్తతతో వ్యవహరించాలన్నారు. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లాలపై తుఫాన్ తీవ్ర ప్రభావం చూపనుందని తెలిపారు. అత్యంత భారీ వర్షాల హెచ్చరికలు ఉన్న ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వాగులు, వంకల చెంత జన సంచారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ సూచించారు. తాగు నీరు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలను వీలైనంత త్వరగా పునరుద్ధరించేలా సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేసారు. ప్రజలు.. ప్రభుత్వం నుంచి వచ్చే హెచ్చరికలు పాటిస్తూ, యంత్రాంగానికి సహకరించాలన్నారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని పవన్ కల్యాణ్ సూచించారు.

ప్రభుత్వం అప్రమత్తం.. కీలక సూచనలు
అదే విధంగా తీవ్ర తుఫాన్ నేపథ్యంలో ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈరోజు, రేపు.. రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అర్ధరాత్రి- తెల్లవారుజాము సమయంలో ఒంగోలు సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని తెలిపిన హోంమంత్రికి ప్రఖర్ జైన్ తెలిపారు. దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల కలెక్టర్లు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవా లని హోంమంత్రి సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కలెక్టర్లు కృషి చేయాలని..విద్యుత్ లైన్ల మీద చెట్లను ముందుగానే తొలగించాలని తెలిపారు. విద్యుత్, నెట్‌వర్క్ సమస్యల తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. మత్స్యకారుల బోట్లు, వలలు సురక్షితంగా ఉంచుకునేలా అలర్ట్ చేయాలని సూచనలు చేశారు. అధికార యంత్రాంగం 48గంటల పాటు హైఅలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు. తుఫాన్‌ను ఎదుర్కోడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉండాలన్నారు. తుఫాన్ సమస్యలకు మనమిత్ర వాట్సాప్ 9552300009 ద్వారా తక్షణ పరిష్కారం చూపనున్నట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications
