డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజీనామా చెయ్యాలి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూట‌మి పాల‌న‌లో ప్రభుత్వ ఉద్యోగులకు, పోలీసుల‌కు క‌నీస గౌరవమే కాదు, రక్షణ కూడా లేదని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... నాడు వైయ‌స్సార్సీపీ హ‌యాంలో గ‌ర్జించే పులిలా ఉన్న పోలీసులు నేడు చంద్ర‌బాబు పాలనలో కోర‌లు పీకిన పాములుగా మారారని అన్నారు. సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించే పోలీస్ వ్య‌వ‌స్థ‌తో కూటమి నేతలు ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు.

పవన్ కళ్యాణ్ కు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ డిమాండ్
డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న అటవీ శాఖ సిబ్బందిపై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డిపై చర్య తీసుకునే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. తన శాఖ సిబ్బందికే రక్షణ కల్పించలేని పవన్ కళ్యాణ్‌ తన పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు.

Pawan Kalyan should resign Gorantla Madhav demands

అట‌వీశాఖ మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక చిన్న ట్వీట్‌తో సరిపెడతాడా?
టీడీపీ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజ‌శేఖ‌ర్‌ రెడ్డి, స్థానిక జ‌న‌సేన నాయ‌కుడితో క‌లిసి అట‌వీ అధికారుల‌ను జీపులో తిప్పుతూ రాత్రంతా వేధించి హింసించాడన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన ఈ ఘ‌ట‌న‌లో నిందితుల‌పై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిపోయి అట‌వీశాఖ మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక చిన్న ట్వీట్‌తో సరిపెట్టాడని మండిపడ్డారు.అట‌వీ అధికారులు నేరుగా వ‌చ్చి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని క‌లిసి త‌మ వేద‌న‌ను చెప్పుకున్నా ఆయ‌న‌లో చ‌ల‌నం లేదన్నారు.

నిందితుల‌ను క‌ఠినంగా శిక్షిస్తామ‌ని పవన్ కళ్యాణ్ చెప్పలేదెందుకు?
ఆ ఘ‌ట‌న గురించి అట‌వీశాఖ అధికారులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో చెబుతుంటే క‌నీసం త‌లెత్తి చూసే స్థితిలో కూడా ఆయ‌న లేడన్నారు. ప్రెస్‌ మీట్ పెట్టి నిందితుల‌ను క‌ఠినంగా శిక్షిస్తామ‌ని చెప్పే ధైర్యం కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి లేదని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శించారు. శ్రీశైలం ఘ‌ట‌న‌లో కేసు న‌మోదు చేసిన ఎమ్మెల్యే బుడ్డా, జ‌న‌సేన నాయ‌కుల‌ను అరెస్ట్ చేయ‌లేదన్నారు.

పవన్ కళ్యాణ్ స్పష్టమైన ప్రకటన చెయ్యాలి
తూతూమంత్రంగా ఎఫ్ఐఆర్ క‌ట్టి చిన్న కేసు పెట్టి మూల‌న ప‌డేశారని మండిపడ్డారు. బుడ్డాపై కిడ్నాప్‌, హ‌త్యాయ‌త్నం, విధుల‌కు ఆటంకం క‌లిగించిన సెక్ష‌న్ల కింద కేసులు పెట్టాలని గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. అట‌వీ శాఖ అధికారుల‌ను కొట్టిన నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని త‌క్ష‌ణ‌మే ప్రెస్‌మీట్ పెట్టి ఆ శాఖ మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేయాలని, వారిని అరెస్ట్ చేయించాలని డిమాండ్ చేశారు.

పోలీసులను కోర‌లు పీకేసిన పాములుగా మార్చేసి ఆడిస్తున్నారు
కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక రెడ్‌బుక్ రాజ్యాంగంతో పోలీసుల న‌డ్డి విరిచారని ఆయన ఆరోపించారు . వైయ‌స్సార్సీపీ హ‌యాంలో నాలుగో సింహంలా గౌర‌వంగా ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించిన పోలీసులకి కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక ర‌క్ష‌ణ లేకుండా పోయిందన్నారు. ప్ర‌భుత్వానికి ఇంత‌క‌న్నా సిగ్గుత‌క్కువ ప‌ని ఇంకోటి ఉంటుందా? అని మండిపడ్డారు. వేటాడే పులుల్లా ఉండాల్సిన పోలీసుల్ని చంద్ర‌బాబు కోర‌లు పీకేసిన పాములుగా మార్చేసి ఆడిస్తున్నాడన్నారు.పవన్ కళ్యాణ్ అటవీ అధికారులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలకు ఆదేశిస్తారా? లేక రాజీనామా చేస్తారా చెప్పాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+