కాబోయే మేయర్ వంగవీటి రాధాకు పుట్టినరోజు కానుక..! పవన్ స్పెషల్ గ్రీటింగ్స్..!
విజయవాడ మేయర్ అభ్యర్దిగా కూటమి పార్టీల తరఫున పోటీ చేసిన జనసేన నేత వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti radha) ఇవాళ ఓట్ల లెక్కింపులో ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. నగరంలో తొలిసారి మేయర్ అభ్యర్ధిగా పోటీ చేసిన వంగవీటి తన ప్రత్యర్థులు అయిన వైసీపీ నేత రాయన భాగ్యలక్ష్మి, స్వతంత్ర అభ్యర్ధి ఏబీ వెంకటేశ్వరరావు కంటే చాలా ముందున్నారు. దీంతో విజయవాడ మేయర్ గా వంగవీటి రాధ ఎన్నిక లాంఛనమే. మెజార్టీ ఎంత అన్నది మాత్రమే చూసుకోవాల్సి ఉంది. మరోవైపు ఇవాళే వంగవీటి రాధ పుట్టినరోజు.
దీంతో వంగవీటి అభిమానులు, కాపు నేతలు, కూటమి పార్టీల శ్రేణులు, నాయకులు ఇలా ప్రతీ ఒక్కరూ వంగవీటి రాధాకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదే క్రమంలో జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా వంగవీటి రాధాకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. పుట్టినరోజునే వంగవీటి రాధాకు మేయర్ అభ్యర్ధిగా గెలుపు రూపంలో మరో కానుక లభించనుండటంపై పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు.

జనసేన నాయకులు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కూటమి అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో తెలిపారు. ఈ జన్మదినం నాడే ఆయన శుభవార్త వింటారని కూడా చెప్పుకొచ్చారు. ఆయన నాయకత్వంలో విజయవాడ నగరం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందనే విశ్వాసం ఉందని పవన్ తెలిపారు. వంగవీటి రాధాకృష్ణ కు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు అందించాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాని జనసేనాని పేర్కొన్నారు. మరోవైపు చాలాకాలం తర్వాత విజయవాడ రాజకీయాల్లో అధికారిక హోదాలో కనిపించబోతున్న వంగవీటి రాధాను అభినందించేందుకు ఆయన నివాసానికి కూడా జనం క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది.














Click it and Unblock the Notifications
