గరీబ్‌రథ్ లో బెంగళూరు వెళ్ళాలంటే 15గంటలు..ప్రయాణికుల లేటెస్ట్ డిమాండ్!
సహజంగా బస్సు కంటే రైళ్ళలో ప్రయాణం వేగవంతంగా ఉంటుంది. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్ళాలంటే వోల్వో బస్సులో అయితే 8న్నర నుండి 9 గంటల సమయం పడుతుంది. అదే వందే భారత్ వంటి రైల్లో 8 గంటల 15 నిముషాల్లో చేరుకుంటాం., సాధారణ సూపర్ ఫాస్ట్ రైల్లో 11 గంటల నుండి 13 గంటల సమయం పడుతుంది. కానీ దక్షిణ మధ్య రైల్వేసికింద్రాబాద్ నుంచి యశ్వంత్‌పూర్ వెళ్లే గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ 12736/35 ప్రయాణికులకు తలనొప్పిగా మారింది.
ఈ రైలు సికింద్రాబాద్ నుండి యశ్వంతాపూర్ కు చేరుకోవటానికి దాదాపు 15 గంటలు పడుతోంది. వరంగల్ నుంచి బెంగళూరు వెళ్లాలనుకునే వారికి ఇది చాలా ఎక్కువ సమయం కావటంతో ఈ రైలు ఎక్కాలంటేనే భయపడుతున్నారు. . అందుకే చాలామంది బస్సులు లేదా ఇతర రైళ్లను ఎంచుకుంటున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్లో ఈ రైలు 15 గంటల పాటు ఖాళీగా నిలిచి ఉంటుంది.

సాధారణంగా సికింద్రాబాద్ నుంచి యశ్వంత్‌పూర్ చేరుకోవడానికి ఇంత సమయం పట్టకూడదు. కానీ గరీబ్రథ్కు ఎక్కువ స్టాప్‌లు ఉండటం, రూట్లో ఆలస్యాలు జరగడంతో ప్రయాణ సమయం పెరిగిపోయింది. మరోవైపు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు, ఇతర రైళ్లు తక్కువ సమయంలో చేరుకుంటున్నాయి. బస్సులు కూడా 10-12 గంటల్లో బెంగళూరు చేరుకోవడంతో ప్రయాణికులు అవే ఎంచుకుంటున్నారు.
వరంగల్ నుంచి బెంగళూరుకు రోజూ పలు రైళ్లు నడుస్తున్నాయి. 22365, 12296 వంటి రైళ్లు రెండు రోజులకోసారి నడుస్తే, మరికొన్ని రోజువారీగా ఉన్నాయి. కానీ గరీబ్‌రథ్ టైమింగ్ సరిగా లేకపోవడం, ఎక్కువ సమయం పట్టడం వల్ల ప్రయాణికులు నిరాశ చెందుతున్నారు. బెంగళూరు వెళ్లే వారిలో ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులు ఎక్కువ. వారికి సమయం విలువైనది. 15 గంటల ప్రయాణం వారికి అనుకూలంగా లేదు.
దీంతో రైల్వే అధికారులు ఈ అంశంపై దృష్టి పెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. రూట్‌ను సవరించడం, అనవసర స్టాప్‌లు తగ్గించడం, సమయాన్ని తగ్గించడం వంటి చర్యలు తీసుకుంటే గరీబ్రథ్కు డిమాండ్ పెరుగుతుంది. ప్రస్తుతం చాలామంది బస్సు ప్రయాణాన్నే సౌకర్యవంతంగా భావిస్తున్నారు. ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి బెంగళూరుకు రైలు సౌకర్యం మెరుగుపడితే ప్రయాణికులకు కాస్త ఊరట లభిస్తుంది. రైల్వే శాఖ ఈ విషయంలో త్వరగా చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆశిస్తున్నారు.













Click it and Unblock the Notifications
