రేపటి నుంచి వన్డేల పండగ: భారత్ లో మ్యాచ్ టైమింగ్స్, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్

టీ20 సిరీస్‌ను 3-2 తేడాతో చేజిక్కించుకున్న భారత జట్టు.. ఇప్పుడిక వన్డేల్లోకి అడుగు పెడుతోంది. ఈ ఫార్మాట్‌లో న్యూజిలాండ్‌ను ఎదుర్కొనడానికి సిద్ధమైంది. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా మొదటి వన్డే బుధవారం ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఈ సిరీస్ ద్వారా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి వన్డే జట్టులోకి రీఎంట్రీ ఇస్తోన్నారు.

తొలి మూడు వన్డేలకు శుబ్‌మన్ గిల్ జట్టుకు నాయకత్వం వహించనుండగా, చివరి రెండు మ్యాచ్‌లకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు ఈ సిరీస్ నుంచి కూడా విశ్రాంతి లభించింది. ఫాస్ట్ బౌలర్ ప్రసిధ్ కృష్ణ గాయం కారణంగా సిరీస్‌కు దూరం కావడం వల్ల అతని స్థానంలో ఆకిబ్ నబీ జట్టులోకి వచ్చాడు. తొలి మూడు మ్యాచ్‌లకు ఆడే అవకాశం లభించింది.

India vs New Zealand 1st ODI Full schedule squads Predicted Playing 11 and live streaming timings

ఆక్లాండ్ లో టీమిండియాకు చెప్పుకోదగ్గ విజయాలు లేవు. ఇక్కడ న్యూజిలాండ్ తో జరిగిన 11 వన్డేల్లో భారత్ నాలుగు మ్యాచ్‌లల్లో మాత్రమే విజయం సాధించింది. 2022లో ఇక్కడ జరిగిన చివరి వన్డేలో కూడా భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. గ్రౌండ్ పరిమాణం, అక్కడి పిచ్ పరిస్థితులు కివీస్ పేసర్లకు అనుకూలించడం భారత బ్యాటర్లకు ప్రధాన పరీక్ష.

న్యూజిలాండ్ కు గట్టి ఎదురుదెబ్బ: టీమిండియాతో మొదటి వన్డే నుంచి స్టార్ బ్యాటర్ అవుట్
న్యూజిలాండ్ కు గట్టి ఎదురుదెబ్బ: టీమిండియాతో మొదటి వన్డే నుంచి స్టార్ బ్యాటర్ అవుట్

న్యూజిలాండ్ జట్టు కూడా పలు కీలక మార్పులతో బరిలోకి దిగుతోంది. రచన్ రవీంద్ర, మార్క్ చాప్‌మన్ గాయాల కారణంగా సిరీస్‌కు దూరం కాగా, వారి స్థానాల్లో టిమ్ సీఫెర్ట్, హెన్రీ నికోల్స్‌లను బోర్డు తిరిగి జట్టులోకి తీసుకుంది. మిచెల్ శాంట్నర్ ఈ సిరీస్‌కు నాయకత్వం వహిస్తున్నారు. నవంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్ సన్నాహకాల్లో భాగంగా కివీస్ సీనియర్ బ్యాటర్లు మూడో వన్డే ముగిసిన వెంటనే జట్టును వీడనున్నారు. డెవాన్ కాన్వే కూడా మొదటి వన్డేకు అందుబాటులో ఉండట్లేదు.

షాక్ ఇచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం
షాక్ ఇచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం

అయిదు వన్డేల ఈ సిరీస్ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం ఉదయం 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఆక్లాండ్‌ అనంతరం తదుపరి మ్యాచ్‌లు 7న వెల్లింగ్టన్, 10న హామిల్టన్, 13, 15 తేదీల్లో చివరి రెండు వన్డేలు మౌంట్ మాంగనుయ్ లల్లో జరగనున్నాయి. భారత్ లో ఈ సిరీస్ ప్రసార హక్కులను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ దక్కించుకుంది. సోనీ స్పోర్ట్స్ ఛానళ్లు, డిజిటల్‌లో సోనీ లివ్ యాప్‌లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.

మొదటి వన్డే టీమిండియా తుదిజట్టులో.. శుభ్‌మన్ గిల్ (కేప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్/శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నమన్ ధీర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, కుల్ దీప్ యాదవ్ కు చోటు దక్కొచ్చు.

న్యూజిలాండ్ అంచనా తుది జట్టు: టిమ్ సీఫెర్ట్, విల్ యంగ్, డారిల్ మిఛెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిఛెల్ శాంట్నర్ (కెప్టెన్), మాట్ హెన్రీ, కైల్ జేమీసన్, జాకబ్ డఫీ, నాథన్ స్మిత్ ఆడే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+