డిసెంబర్లో పవన్‌కళ్యాణ్ పాదయాత్ర, త్వరలో పార్టీ ప్లీనరీ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ పాదయాత్ర నిర్వహించేందుకు సన్నాహలు చేస్తున్నారు. 2019 ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసే పనిలో పవన్‌కళ్యాణ్ ఉన్నారు. అంతేకాదు పార్టీ ప్లీనరీ నిర్వహణ తదితర అంశాలపై పవన్ పార్టీ ముఖ్యులతో ఆదివారం నాడు చర్చించారు.

2019లో పవన్ టిడిపితోనే: 'టిడిపి నేతలతో పవన్‌కు సత్సంబంధాలు'

జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ పార్టీ ముఖ్యులతో ఆదివారం నాడు హైద్రాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీని బలోపేతం చేసే విషయమై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో ప్రధానంగా ప్రభావం చూపించే అంశాలు పార్టీ ఏ రకమైన వ్యూహన్ని అనుసరించాలనే దానిపై చర్చించారు.

2019 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయాలని పవన్ నిర్ణయం తీసుకొన్నారు. 2014 ఎన్నికల సమయంలో పార్టీని ఏర్పాటు చేసినప్పటికీ కూడ ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు.

అయితే 2019 ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయం తీసుకొంది.జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ అనంతపురం జిల్లా నుండి పోటీ చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.

త్వరలో పార్టీ ప్లీనరీ సమావేశం

త్వరలో పార్టీ ప్లీనరీ సమావేశం

పార్టీ ముఖ్యులతో జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ ఆదివారం నాడు సమావేశమయ్యారు.పార్టీని బలోపేతం చేసేందుకు చేపట్టిన చర్యలపై చర్చించారు. పార్టీ ప్లీనరీ నిర్వహించే అంశంపై చర్చించారు. త్వరలోనే పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించాలని జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ నిర్ణయం తీసుకొన్నారు.అయితే పార్టీ ప్లీనరీ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

నవంబర్‌లో పాదయాత్ర

నవంబర్‌లో పాదయాత్ర


నవంబర్‌‌ చివర్లో లేదా డిసెంబర్‌లో పాదయాత్ర నిర్వహించాలని జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ నిర్ణయం తీసుకొన్నారు.వైసీపీ చీఫ్ జగన్‌ కూడ నవంబర్ రెండవ తేది నుండి పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే పవన్ కళ్యాణ్ కూడ పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకోవడం ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకొంది.

2019 ఎన్నికలకు జనసేన సన్నద్దం చేస్తోన్న పవన్

2019 ఎన్నికలకు జనసేన సన్నద్దం చేస్తోన్న పవన్

2019 ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ సన్నద్దం చేస్తున్నారు.. పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకోవడం ద్వారా ప్రజల్లో తమ పార్టీ వాణిని విన్పించేందుకు వేదికగా ఉపయోగించుకోవాలని పవన్‌కళ్యాణ్ బావిస్తున్నారు. అదే సమయంలో ఆయా ప్రాంతాల్లో ఎన్నికల్లో ప్రభావితం చేసే అంశాలపై కూడ అధ్యయనం చేయనున్నారు. ఈ అంశాలపై పవన్‌కళ్యాణ్ పార్టీ యంత్రాంగాన్ని సన్నద్దం చేస్తున్నారు.

రాజకీయాలకు ఇక పూర్తి సమయం

రాజకీయాలకు ఇక పూర్తి సమయం


వచ్చే ఎన్నికల్లో పార్టీని నడిపించేందుకు గాను జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ త్వరలోనే పార్టీకి పూర్తి సమయాన్ని కేటాయించనున్నారు.తన చేతిలో ఉన్న సినిమాల షూటింగ్‌లు పూర్తి చేసిన తర్వాత రాజకీయాలకే పూర్తి సమయం కేటాయించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Janasena chief Pawan kalyan will start paadayatra from November ending or December first week.Pawan kalyan meeting with party leaders on Sunday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి