అల్లు అర్జున్ ను కలవబోతున్న పవన్-కాసేపట్లో హైదరాబాద్ కు ..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా తన చిత్రం పుష్ప2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ కు వెళ్లి తొక్కిసలాటకు, ఓ మహిళ మృతికి కారణమయ్యారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో ఆయన్ను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు కూడా పంపారు. అయితే హైకోర్టుట మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అల్లు అర్జున్ బయటికి వచ్చారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో తనకు అండగా నిలిచిన మెగా ఫ్యామిలీ పెద్దల్ని అల్లు అర్జున్ వరుసగా కలుస్తున్నారు.
ఇదే క్రమంలో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఇంటికి, ఆయన సోదరుడు నాగబాబు ఇంటికి కూడా వెళ్లి కలిసిన అల్లు అర్జున్ ఇవాళ మరో సోదరుడు పవన్ కళ్యాణ్ ను సైతం కలవబోతున్నారు. అల్లు అర్జున్ అరెస్టు తర్వాత ఆయన్ను కలిసేందుకు వీలు కుదరకపోవడంతో దూరంగా ఉండిపోయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఆయన్ను కలిసేందుకు హైదరాబాద్ వెళ్తున్నారు. అయితే అల్లు అర్జున్ ఇంటికి పవన్ వెళ్లే అవకాశాలు తక్కువే. అల్లు అర్జునే పవన్ ను ఆయన నివాసంలో కలవబోతున్నారు.

మధ్యాహ్నం మంగళగిరి ఎయిమ్స్ లో ఓ కార్యక్రమం కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రానికి వస్తున్నారు. ఆమెను గన్నవరం ఎయిర్ పోర్టులో రిసీవ్ చేసుకునేందుకు వెళ్లనున్న పవన్ కళ్యాణ్.. అక్కడి నుంచి 11.30కి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ పయనం కాబోతున్నారు. హైదరాబాద్ వెళ్లాక నేరుగా ఇంటికి వెళ్లనున్న పవన్ కళ్యాణ్ ను అల్లు అర్జున్ వచ్చి కలిసే అవకాశాలు ఉన్నాయి. అల్లు అర్జున్-పవన్ కళ్యాణ్ మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తున్న నేపథ్యంలో వీరిద్దరు భేటీ అయితే అభిమానులకు కూడా పండగే అని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications