‘పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం అవ్వాలని దేవుడు రాసిపెట్టి ఉంచాడు!’
అమరావతి: జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్ కళ్యాణ్‌పై సీనియర్ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తిగా చెబుతున్నానంటూ పవన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు మంచి క్రేజ్ ఉందని అన్నారు.

మనమంతా నటులేమనన్న పవన్ కళ్యాణ్
ఎక్కడికి వెళ్లినా పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఉన్నారని.. ఇది ఆయన అదృష్టమని సుమన్ వ్యాఖ్యానించారు. రాజకీయమైనా.. వ్యాపారమైనా కూడా ఆ దేవుడు రాసి పెట్టి ఉంచాలి.. మనం అంతా కూడా నటులమేనని అన్నారు. ఆ దేవుడు మనకు కొన్ని రోజులపాటు కొన్ని పనులు అప్పగిస్తాడన్నారు. మీరు చేసే పని నేను చేయలేదు.. నేను చేసే పని మీరు చేయలేరు అని సుమన్ చెప్పారు.

పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం అవ్వాలని రాసిపెట్టి ఉంచాడు
జీవితంలో పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని దేవుడు రాసిపెట్టి ఉంచాడు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ వరుసగా ఐదుసార్లు సీఎంగా ఉన్నారు. కంటిన్యూగా 25 ఏళ్లు ఆయనే ఉన్నారు. దేనికైనా ఒక ఎక్స్‌పైరీ టైం ఉంటుంది. ఆ టైమ్ వచ్చిన్పపుడు వెళ్లిపోతోంది. సినిమాల విషయంలో వచ్చేసరికి పవన్‌కు ఇప్పుడున్న ఫాలోయింగ్ ఇంక ఎవ్వరికీ లేదని సుమన్ చెప్పారు.

ఏపీకి సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడు సీఎం అవుతారంటే?
పవన్ కళ్యాణ్‌కు ఎప్పుడు సీఎం స్థానం దక్కుతుంది. ఆ సందర్భం ఎప్పుడు వస్తుంది. క్యాస్ట్ ఇక్వేషన్ సెట్ అవ్వాలి. ఎప్పుడు చేయాలని జనాలు అనుకుంటారో.. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బ్యాలెన్స్ అవుతుంది. ఈ మనిషి వస్తే వాళ్లంతా ధైర్యంగా ఉంటారని ఎప్పుడు అనుకుంటారో అప్పుడు ఆయన అవుతారు.
ఓ నటుడిగా పవన్ కు మంచి జరగాలని కోరుకుంటున్నా.. ఆరోగ్యం మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నా అని సుమన్ వ్యాఖ్యానించారు. కాగా, మెగాస్టార్ చిరంజీవికి, సుమన్‌కు బేధాభిప్రాయాలు ఉన్నాయనే ప్రచారం నేపథ్యంలో సుమన్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
-
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications