స్టాలిన్ కో సలహా.. విజయ్ కో సూచన.. చెన్నై టూర్ లో పవన్ కీలక వ్యాఖ్యలు ..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ చెన్నైలో జమిలి ఎన్నికలపై నిర్వహించిన సెమినార్ లో పాల్గొన్నారు.తిరువాన్మియూర్ లోని రామచంద్ర కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ సెమినార్ లో పవన్ కళ్యాణ్ జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
జమిలి ఎన్నికలు దేశ ప్రగతికి చేయూతనిచ్చే సంస్కరణ అని, దేశ జీడీపీకి ఊతం ఇచ్చే విధానమని తెలిపారు. జమిలి ఎన్నికలతో దేశానికి ఎలాంటి నష్టం వాటిల్లదన్నారు. తమిళనాట వన్ నేషన్.. వన్ ఎలక్షన్ గురించి అబద్ధపు ప్రచారం సాగుతోందని, ఒకప్పుడు కరుణానిధి జమిలి ఎన్నికలు సూపర్ అన్నారని, అది ఇప్పుడు తప్పు ఎలా అవుతుందన్నారు.

జమిలి ఎన్నికలు దేశానికి చాలా అవసరమైన మార్పు అని పవన్ తెలిపారు. దేశంలో ఎన్నికలు అనేవి ఒక నిరంతర ప్రక్రియలా మారిపోయి దేశ ప్రగతికి ఆటంకం కలిగిస్తున్నాయన్నారు. తరచూ ఎన్నికల నిర్వహణతో భారీగా ఖర్చుతోపాటు సమయం వృథా అవుతోందన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడం వల్ల ప్రభుత్వ విధానాల అమలు స్తంభించిపోతుందని, తద్వారా అభివృద్ధి, సంక్షేమం నిలిచిపోతుందని గుర్తుచేశారు. జమిలి ఎన్నికల వల్ల దేశానికి లాభమే తప్ప నష్టం వాటిల్లదన్నారు.

pawan kalyan s two suggestions to mk stalin and hero Vijay over one nation-one election

తమిళనాట ఒకే దేశం.. ఒకే ఎన్నిక గురించి అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, ఈ వ్యవహారంలో ఇండియా కూటమి పక్షాలు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నాయని పవన్ ఆరోపించారు. ఒకప్పుడు కరుణానిధి సమర్థించిన జమిలి ఎన్నికల్ని ఇప్పుడు ఆయన కుమారుడు స్టాలిన్ వ్యతిరేకించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. ఈ అంశంపై స్టాలిన్ పునరాలోచన చేయాలన్నారు. ఒకప్పుడు దేశం మొత్తం ఒకే ఎన్నిక కావాలని కోరుకున్న వారే ఇప్పుడు ఆ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని పవన్ ఆరోపించారు. ఈ మధ్య కాలంలో వైసీపీ లాంటి రాజకీయ పక్షాలు ఎన్నికల్లో గెలిస్తే అది తమ గొప్పే అని, ఓడిపోతే ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయని నిందిస్తున్నాయన్నారు. అలా ద్వంద్వ వైఖరి ప్రదర్శించే వారే నేడు జమిలిని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.

pawan kalyan s two suggestions to mk stalin and hero Vijay over one nation-one election

హీరో విజయ్ తనకు మంచి మిత్రుడని పవన్ తెలిపారు. పార్టీ అధినేతగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది ఆయనే అన్నారు. విజయ్ ఎవరినీ అనుసరించకపోవడం మంచిదని పవన్ సూచించారు. నటుడుగా రాణించడం వేరు, నటుడు రాజకీయాల్లోకి రాణించడం వేరు అని తెలిపారు. కూటమికి మద్దతుగా ప్రచారం చేయడం తన బాధ్యతని, గతంలోనూ మహారాష్ట్ర, కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేశానని పవన్ గుర్తుచేశారు. అవసరం అనుకుంటే తమిళనాడు ఎన్నికల్లో కూడా ప్రచారం నిర్వహిస్తానన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+