Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పిఠాపురానికి కేంద్రం గుడ్ న్యూస్..!
కాకినాడ జిల్లా పిఠాపురం (pithapuram)నుంచి తొలిసారి పోటీ చేసిన గెలిచిన పవన్ కళ్యాణ్ (Pawan kalyan).. అనంతరం డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పిఠాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న పవన్ ఇందులో భాగంగా కేంద్రానికి ఓ విజ్ఞప్తి చేశారు. దీన్ని కేంద్రం కూడా తాజాగా ఆమోదించింది. దీంతో పిఠాపురం ప్రజలకు ఇకపై మరింత మెరుగైన రైలు ప్రయాణం అనుభవం రాబోతోంది. దీంతో పవన్ కేంద్రంతో పాటు సీఎం చంద్రబాబుకూ థ్యాంక్స్ చెప్పారు.
పిఠాపురం రైల్వే స్టేషన్ ను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద అభివృద్ధి చేయాలని పవన్ కళ్యాణ్ చేసిన ప్రతిపాదనలకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. రూ.37.25 కోట్లతో స్టేషన్ లో మౌలిక వసతులు అభివృద్ధి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత పిఠాపురం పర్యటనలో పవన్ కళ్యాణ్ క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లిన సందర్భంలో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు అశుభ్రత, దుర్గంధం వెదజల్లుతుండడాన్ని చూసి తక్షణం శుభ్రం చేయాలని అధికారుల్ని ఆదేశించారు.

ఫలించిన ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి కృషి
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) April 6, 2026
•అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ పరిధిలోకి పిఠాపురం రైల్వే స్టేషన్
•రూ. 37.25 కోట్లతో అభివృద్ధి పనులు
•మారనున్న పిఠాపురం రైల్వే స్టేషన్ రూపురేఖలు
రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి కృషితో పిఠాపురం రైల్వే… https://t.co/JDaKm4qHsZ
అనంతరం జనవరి నెలలో ఢిల్లీకి వెళ్లినప్పుడు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిసి ఈ మేరకు పిఠాపురం స్టేషన్ ను అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి చేయాలని కోరారు. ఆధ్యాత్మికంగా ముఖ్య పట్టణమైన పిఠాపురంలోని రైల్వే స్టేషన్ కి సుధూర ప్రాంతాల నుంచి యాత్రికులు వస్తారని, వారి సౌకర్యార్ధం అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి చేయాలని కోరారు.
దీనికి ఆయన కూడా అంగీకరించారు. దీనికి కొనసాగింపుగా పిఠాపురం స్టేషన్ ను అమృత్ భారత్ స్టేషన్ గా అభివృద్ధి చేసేందుకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. దీంతో స్టేషన్ భవనం, ముఖద్వారంతోపాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలతో కూడిన విశ్రాంతిగది నిర్మాణం, అత్యాధునిక టాయిలెట్లు, డ్రైనేజీ వ్యవస్థ, కేబులింగ్, ప్లాట్ ఫారం అభివృద్ధి, షెల్టర్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.












Click it and Unblock the Notifications