వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గూగుల్ తల్లిని నమ్ముకుని తెగబడ్డ మందుబాబులు .. ఏం చేస్తున్నారో తెలిస్తే షాక్ !!

|
Google Oneindia TeluguNews

మద్యం షాపులు కరోనా లాక్ డౌన్ తో మూత పడిన వేళ తమకున్న అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు మందుబాబులు. ఒక పక్క కల్లు కోసం నానా తంటాలు పడుతూనే కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసి, 108 కు 100 కు డయల్ చేసి మద్యం లేకపోతే చచ్చిపోవాలనిపిస్తోందని మందుబాబులు ఆవేదన వ్యక్తం చేస్తూ మద్యం షాపులు తెరవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మరోపక్క గూగుల్ తల్లిని కూడా మద్యం తయారీ ఎలా అని అడుగుతూ తెగ ప్రయోగాలు చేస్తున్నారు మందుబాబులు .

మందు కావాలా నాయానా: గంటలో డెలివరీ అంటూ ఫోన్, బ్యాంక్ డేటా తీసుకొని ఛీటింగ్..మందు కావాలా నాయానా: గంటలో డెలివరీ అంటూ ఫోన్, బ్యాంక్ డేటా తీసుకొని ఛీటింగ్..

గూగుల్ లో లిక్కర్ తయారీపై సెర్చ్ చేస్తున్న నెటిజన్లు

గూగుల్ లో లిక్కర్ తయారీపై సెర్చ్ చేస్తున్న నెటిజన్లు


లాక్ డౌన్ వేళ మందుబాబులు గూగుల్ తల్లికి తెగ ప్రశ్నలు వేసి ఇబ్బంది పెడుతున్నారు.. మందు తాగాలనుంది ఎలా అని అడుగుతున్నారు . మందు ఎక్కడ దొరుకుతుంది. ఎలా తయారు చేయాలి అంటూ తెగ సెర్చ్ చేస్తున్నారు . 2020, మార్చి 22 నుంచి మార్చి 28వ తేదీ వరకు, అలాగే ఏప్రిల్ 12వ తేదీ నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు మద్యం పైనే గూగుల్ లో ఎక్కువ సెర్చ్ చేరినట్టు తేలింది. మద్యం లేకుండా వుండలేకపోతున్న మందుబాబులు మద్యం కోసం దేనికైనా రెడీ అంటున్నారు .

మద్యం తయారీపై సెర్చ్ చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ 5, తెలంగాణా 10 స్థానాల్లో

మద్యం తయారీపై సెర్చ్ చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ 5, తెలంగాణా 10 స్థానాల్లో

ఇక మద్యం తయారీ అనే అంశాన్ని సెర్చ్ చేస్తున్న రాష్ట్రాల్లో మణిపూర్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, అసోం, ఏపీ వరుస ఐదు స్థానాల్లో ఉండగా తెలంగాణ పదో స్థానంలో నిలిచింది. ఇక బీర్ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు అని ఫీల్ అవుతున్న వారు బీర్ ఎలా తయారు చేసుకోవాలి అనే అంశం పై గూగుల్లో తెగ వెతుకుతున్నారు. అంతటితో ఆగక తెగ ప్రయోగాలు కూడా చేస్తున్నారు. బీర్ కోసం నానా చావు చస్తున్నారు . ఇక బీర్ కోసం సెర్చ్ చేసిన జాబితాలో ఢిల్లీ, కేరళ, హర్యాణ, కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, ఏపీ, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ మొదటి 10 స్థానాల్లో నిలిచాయి.

ఇళ్లలోనే మద్యం తయారు చేస్తూ దొరికిపోతున్న ఘటనలు

ఇళ్లలోనే మద్యం తయారు చేస్తూ దొరికిపోతున్న ఘటనలు

ఇక లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఇంట్లో మద్యం తయారు చేసి దొరికిన ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి . తాజాగా కూడా యూట్యూబ్ లో చూసి క్యారెట్ బీర్ తయారు చేసి దొరికారు. ఇక ఇటీవల ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ చర్చికాలనీలో నివాసముంటున్న పొలిశెట్టి సుధాకర్‌ అనే వ్యక్తి తన తల్లి తెరిహమ్మతో కలిసి ఇంట్లోనే మద్యం తయారీని ప్రారంభించాడు. విషయం బయటికి పొక్కడంతో పోలీసులు వారిని పట్టుకున్నారు. నిందితుల వద్ద నుండి 25లీటర్ల మద్యం తయారీకి కావలసిన ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఇక వీళ్ళే కాదు మద్యానికి ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి గూగుల్ తల్లిని నమ్ముకుని తయారు చెయ్యటానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు మద్యం ప్రియులు.

English summary
Wine shops are locked down by corona . people asking Google q about how to make liquor. Where to find the liquor. most of the people are searching for how to make. From March 22nd to March 28th, as well as from April 12th to April 18th, Google has been searching for alcohol.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X