చంద్రబాబు రేవంత్ రెడ్డిల భేటీపై పేర్ని నాని ఏమన్నారంటే

ఏపీ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హైదరాబాదులోని ప్రజాభవన్ వేదికగా సమావేశమైన విషయం తెలిసిందే. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు పరిష్కారంతోపాటు పలు ఇతర అంశాల పైన చంద్రబాబు రేవంత్ రెడ్డి మాట్లాడుకున్నారు. అనేక కీలక అంశాలపైన చర్చించారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు ఇద్దరు సీఎంలు అయిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ భేటీ అందరికీ ఆసక్తిని కలిగించింది.

పేర్ని నానీ ట్వీట్
అయితే ఈ భేటీ పై వైసీపీ నేతలు తనదైన తీరులో స్పందిస్తున్నారు తాజాగా తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ పై మాజీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర ట్వీట్ చేశారు. చంద్రబాబు రేవంత్ రెడ్డి నేటి భేటీ పైన మీడియా హడావుడి చేస్తుందని ఆయన తన ట్వీట్ ద్వారా స్పష్టం చేశారు. మీడియాలో ఇదే పెద్ద బ్రేకింగ్ న్యూస్ అని ఆయన పేర్కొన్నారు.

Perni Nani shocking tweet on Chandrababu Revanth Reddy meeting

రెండు రాష్ట్రాల పునరేకీకరణ ఏకైక మార్గంగా
తెలుగు న్యూస్ ఛానల్ లో బ్రేకింగ్ వార్తలు చూస్తుంటే నేటి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశంలో ఇద్దరి డిమాండ్లు తీరాలంటే రెండు రాష్ట్రాల పునరేకీకరణ ఏకైక మార్గంగా కనిపిస్తుంది అంటూ సంచలన ట్వీట్ చేశారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల డిమాండ్ లు చాలా ఉన్నాయని అవి నెరవేరాలంటే రెండు రాష్ట్రాలు మళ్లీ ఏకం కావడమే మార్గం అన్నట్టుగా ఆలోచన చేస్తారన్న అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు.

పేర్ని నానీ ట్వీట్ పై నెటిజన్ల స్పందన
ఇక పేర్ని నాని చేసిన ట్వీట్ పై నెటిజెన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని సమస్యలు ఎన్నో ఉన్నప్పుడు అవకాశాన్ని బట్టి వాళ్ళు మాట్లాడతారు కానీ మీకెందుకు మధ్యలో ఇంత బాధ అంటూ పలువురు సెటైర్లు వేస్తున్నారు. రాష్ట్రానికి లబ్ధి జరగాలని ఆలోచించాలి తప్ప, ఏ చిన్న అవకాశం వచ్చినా దాని పైన కూడా విమర్శలు చేయడం మంచిది కాదని సలహా ఇస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై వైసీపీ టార్గెట్
ఏది ఏమైనా రెండు రాష్ట్రాల సీఎంల భేటీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. ఇక ఈ భేటీ ముగిసిన నేపధ్యంలో చర్చల సారాంశాన్ని బట్టి మరెంత వైసీపీ నాయకులు చంద్రబాబు రేవంత్ లను టార్గెట్ చేస్తారో తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+