కేసీఆర్ గూగుల్‌లో చూసి, పెట్రోనాస్ టవర్స్‌లా(పిక్చర్స్)
హైదరాబాద్: హైదరాబాద్ వాతావరణ పరిస్థితులు, భౌగోళిక స్థితిగతులు మాత్రమే కాకుండా హుస్సేన్ సాగర్ కూడా ఓ గొప్ప వరమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అభివర్ణించారు. అలాంటి హుస్సేన్ సాగర్‌ను పరిశుభ్రమైన మంచినీటి సరస్సుగా మార్చడంతో పాటు దాని చుట్టూ ఆకాశహర్మ్యాలు నిర్మించాలని ముఖ్యమంత్రి సంకల్పించారు. హుస్సేన్ సాగర్ చుట్టూ నిర్మించే భారీ టవర్స్ నగరానికి ఓ మణిహారంగా ఉండాలని ఆకాంక్షించారు.
క్యాంప్ కార్యాలయంలో బుధవారం సీఎం రెవెన్యూ అదికారులతో హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న అనువైన ప్రాంతాల పైన సమీక్ష నిర్వహించారు. సాగర్ చుట్టూ 60 నుండి 100 అంతస్తుల ఎత్తైన టవర్స్ నిర్మించే ప్రతిపాదనల పైన సుదీర్ఘంగా చర్చించారు. టవర్ల నమూనాలను కూడా పరిశీలించారు. అంబేడ్కర్ విగ్రహం పక్కనుండే బోట్స్ క్లబ్ నుండి మొదలుకొని నెక్లెస్ రోడ్డు, జలవిహార్, అంబేడ్కర్ నగర్, సంజీవయ్య పార్క్, సికింద్రాబాద్ బోట్స్ క్లబ్, మారియట్ హోటల్, డీబీఆర్ మిల్స్, లోయర్ ట్యాంక్‌బండ్, సచివాలయం తదితర ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న స్థలాలను, ప్రభుత్వ స్థలాలను సీఎం గూగుల్ మ్యాప్ సాయంతో పరిశీలించారు.

కేసీఆర్
వాతావరణ పరిస్థితులు, భౌగోళిక స్ధితిగతులు మాత్రమేకాకుండా హుస్సేన్‌సాగర్ హైదరాబాద్ నగరానికి ఒక వరమని కేసీఆర్ అభివర్ణించారు. అలాంటి హుస్సేన్ సాగర్‌ను పరిశుభ్రమైన మంచినీటి సరస్సుగా మార్చాలన్నారు. అందుకు అనుగుణంగా... ఎండాకాలంలో హుస్సేన్‌సాగర్‌లోని నీటినంతా ఖాళీ చేసి, అడుగు భాగంలోని చెత్తాచెదారాన్ని తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఇకపై హుస్సేన్‌సాగర్‌లోకి మురుగునీరు చేరకుండా మళ్లింపు కాల్వను తవ్వాలని సూచించారు.

కేసీఆర్
కొత్తగా నిర్మించబోయే టవర్ల నుంచి వచ్చే మురికి నీరు కూడా హుస్సేన్‌సాగర్‌లో కలవకుండా నేరుగా మురికి కాలువలోకి పోయేటట్టు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ఉంటుందని వెల్లడించారు. హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో ఉన్న పలు మురికివాడలను కూడా తొలగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ కుటుంబాలకు భారీ టవర్స్‌లో వసతి కల్పించాలని నిర్ణయించారు. అందమైన అద్భుతమైన టవర్ల సరసననే అంబేద్కర్ నగర్ కాలనీ వాసుల కోసం కూడా మంచి టవర్ నిర్మించి ఇస్తామని సీఎం ప్రకటించారు.

కేసీఆర్
సాగర్ చుట్టూ నిర్మించే భారీ టవర్స్ నగరానికే ఓ మణిహారంగా ఉండాలని కేసీఆర్ ఆకాక్షించారు. 60 నుంచి 100 అంతస్తుల ఎత్తైన ఆకాశ హర్మ్యాలు నిర్మించే ప్రతిపాదనల పై సుదీర్ఘంగా చర్చించారు. టవర్ల నమూనాలను కూడా పరిశీలించారు. అంబేద్కర్ విగ్రహం పక్క నుంచే బోట్స్‌క్లబ్ మొదలుకుని నెక్లెస్ రోడ్, జలవిహార్, అంబేద్కర్ నగర్, సంజీవయ్య పార్క్, సికింద్రాబాద్ బోట్స్ క్లబ్, మారియట్ హోటల్, డీబీఆర్ మిల్స్, లోయర్ ట్యాంక్‌బండ్, సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్ - రైల్వే ట్రాక్ మధ్య ఖాళీగా ఉన్నస్థలాలను, ప్రభుత్వ స్థలాలను ముఖ్యమంత్రి గూగుల్ మ్యాప్ సహాయంతో పరిశీలించారు.

కేసీఆర్
ఈ ఖాళీ స్థలాల్లో అద్భుతమైన ఆకాశ హర్మ్యాలను నిర్మించవచ్చునని సీఎం చెప్పారు. రెవెన్యూ అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఈ స్థలాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు. ‘‘హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలనే తపన తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. అంతర్జాతీయ నగరాలకు ఉండే ఆకర్షణ, ప్రత్యేకతల్లో బహుళ అంతస్తుల భవనాలు చాలా ముఖ్యం'' అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

కేసీఆర్
బహుళ అంతస్తుల భవనాల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. తక్కువ స్థలంలో ఎక్కువ కార్యకలాపాలు నిర్వహించ వచ్చునని, ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సదుపాయాలు, వినోద కే ంద్రాలు, ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఒకో చోట ఉండటం మంచిదని అన్నారు. మలేషియాలోని పెట్రోనాస్ టవర్స్, ముంబయ్‌లోని సముద్ర తీరంలో ఉన్న టవర్స్ ఇందుకు ఉదాహరణగా ముఖ్యమంత్రి చెప్పారు. టవర్స్‌ను ప్రభుత్వమే టవర్స్ నిర్మించి ఇతర సంస్థలకు లీజుకు ఇవ్వడమా? లేక నిర్మాణ బాధ్యతలను కూడా ఇతర సంస్థలకు అప్పగించడమా? ఎలాంటి పద్ధతులు అనుసరించాలి? అనే విషయాల పై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.
డీబీఆర్ మిల్స్ స్థలంలో, మారియట్ హోటల్‌కు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో, హైదరాబాద్, సికింద్రాబాద్ బోట్స్ క్లబ్ స్తలాల్లో, జలవిహార్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో అద్భుతమైన టవర్స్ నిర్మించవచ్చునని కేసీఆర్ తెలిపారు. రెవెన్యూ అదికారులు వెంనటే రంగంలోకి దిగి ఈ స్థలాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు. సాగర్ చుట్టూ ఉన్న భూములన్నింటిలో ప్రతి అడుగుకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని సూచించారు.
హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలనే తపన ప్రభుత్వానికి ఉందని, అంతర్జాతీయ నగరాలకు ఉండే ఆకర్షణ, ప్రత్యేకతల్లో బహుళ అంతస్తుల భవనాలు చాలా ముఖ్యమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో మరే నగరానికి హైదరాబాద్ తీసుపోదని నిరూపించాలన్నారు. బహుళ అంతస్తుల భవనాల వల్ల చాలా ప్రయోజనాలున్నాయన్నారు.












Click it and Unblock the Notifications