కవిత ఇంటి వద్ద రత్నానికి లిఫ్ట్ ప్రమాదం (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు కెఎస్ రత్నం లిఫ్ట్ ప్రమాదంలో గాయపడ్డారు. తెరాస పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఇంటి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లిఫ్ట్ వచ్చిందని భావించి డోర్ తెరిచి కెఎస్ రత్నం అడుగేశారు. దాంతో రెండో అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న లిఫ్ట్‌పై పడిపోయారు.
తీవ్రంగా గాయపడిన రత్నంను నిమ్స్‌కు తరలించారు. రత్నం శక్రవారంనాడు నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవితను కలిసేందుకు హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో గల ఆమె నివాసానికి వెళ్లారు. ఆమెను కలిసి తిరిగి వెళ్లేందుకు ఆమె నివాసంలోని రెండో అంతస్తులో ఉన్న లిఫ్టు వద్దకు వచ్చారు.
అదో ఆలోచనలో ఉన్న ఆయన లిఫ్ట్ రెండో అంతస్తుకు లిఫ్ట్ రాక ముందే డోర్ తెరిచి లోపలికి అడుగు పెట్టారు. దీంతో ఆయన ఒక్కసారిగా కింద పడిపోయారు. దీంతో ఆయన తలకు, కాళ్లకు, చేతులకు గాయాలయ్యాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న గన్‌మెన్ పరుగున వచ్చి ఆస్పత్రికి తరలించారు.

లిఫ్ట్ ప్రమాదంలో రత్నం..
కల్వకుంట్ల కవితను ఆమె నివాసంలో కలిసిన తర్వాత రెండో అంతస్థులో లిఫ్ట్ వచ్చిందనుకుని డోర్ తెరిచి అడుగేయడంతో రత్నం కింద పడిపోయారు.

లిఫ్ట్ ప్రమాదంలో రత్నం...
లిఫ్ట్ రాకముందే డోర్ తెరిచి అడుగేసిన రత్నం గ్రౌండ్ ఫ్లోర్ లిఫ్ట్‌పై పడిపోయారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.

లిఫ్ట్ ప్రమాదంలో రత్నం...
గ్రౌండ్ ఫ్లోర్ లిఫ్ట్‌పై పడిపోయిన రత్నంను కింద ఉన్న గన్‌మెన్ హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

లిఫ్ట్ ప్రమాదంలో రత్నం...
కింద పడిన రత్నం కాళ్లూ చేతులూ తలకూ గాయాలయ్యాయి. ఆయనను ఆస్పత్రికి తరలించారు.

లిఫ్ట్ ప్రమాదంలో రత్నం...
కవితను కలిసిన తర్వాత రత్నం ఏదో ఆలోచనలో లిఫ్ట్ డోర్ తెరిచారు. వెంటనే అడుగేశారు. అయితే, లిఫ్ట్ రాకముందే అడిగేయడంతో ఆయన కిందపడిపోయారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications