• search
  • Live TV
నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏపీలో వరద బీభత్సం: పరిస్థితిపై సీఎం జగన్ కు ప్రధాని మోడీ ఫోన్; రేపు జగన్ ఏరియల్ సర్వే

|
Google Oneindia TeluguNews

ఏపీ లోని వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి మాట్లాడారు . రాష్ట్రంలో వరద పరిస్థితులపై ఆరా తీశారు.రాష్ట్రంలో భారీ వర్షాలు, అనంతర పరిస్థితులను ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి ని అడిగి తెలుసుకున్నారు. నవంబర్ 20 శనివారం వరద ప్రభావిత ప్రాంతాలలో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.

చంద్రబాబు గ్లిజరిన్ పెట్టుకుని ఏడ్చాడు; బాయ్ కాట్ హైడ్రామా.. సింపతీ అస్త్రం: వదిలిపెట్టని కొడాలి నానిచంద్రబాబు గ్లిజరిన్ పెట్టుకుని ఏడ్చాడు; బాయ్ కాట్ హైడ్రామా.. సింపతీ అస్త్రం: వదిలిపెట్టని కొడాలి నాని

జగన్ కు ప్రధాని మోడీ ఫోన్ .. వర్షాల పరిస్థితిపై ఆరా


ఏపీలో విపరీతంగా కురుస్తున్న వర్షాలు, వరదల నేపధ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏపీ సీఎం జగన్ కు ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో పరిస్థితులను, వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల పరిస్థితిని ఏపీ సీఎం జగన్ ప్రధానికి వివరించారు. వరద ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలను ఆయన తెలియజేశారు. సహాయ కార్యక్రమాల కోసం నేవీ హెలికాప్టర్లు వినియోగించుకుంటున్నామని ఆయన ప్రధానికి తెలిపారు. సహాయ కార్యక్రమాల్లో కేంద్రం పూర్తి అండగా ఉంటుందని, ఏ సహాయం కావాలన్నా కోరాలని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సీఎం జగన్ కు చెప్పినట్లుగా సమాచారం.

వరద ప్రభావిత ప్రాంతాలలో జగన్ ఏరియల్ సర్వే

వరద ప్రభావిత ప్రాంతాలలో జగన్ ఏరియల్ సర్వే

ఇదిలా ఉంటే రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఏరియల్‌ సర్వే చేయనున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు సహా భారీ వర్ష ప్రభావిత ప్రాంతాలను ఆయన ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలిస్తారు. వరద నష్టాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా కడప చేరుకుని ముఖ్యమంత్రి అక్కణ్నుంచి హెలికాప్టర్‌ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు. ఏరియల్‌ సర్వే అనంతరం రేణిగుంట విమానాశ్రయం చేరుకుని ముఖ్యమంత్రి, అక్కడి నుంచి గన్నవరం తిరిగి వస్తారు. ఏరియల్‌ సర్వేకు బయలుదేరే ముందు ఏపీ సీఎం వైయస్ జగన్ ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తారు.

 ఏపీలో వర్ష బీభత్సం ... పొంగి పొరులుతున్న వాగులు, వంకలు

ఏపీలో వర్ష బీభత్సం ... పొంగి పొరులుతున్న వాగులు, వంకలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు,వరదల కారణంగా జనజీవనం అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. విపరీతంగా కురుస్తున్న వర్షాలతో కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలో పరిస్థితి దారుణం గా తయారైంది బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు గ్రామాలు, కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రహదారులు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. పశువులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఇళ్ళు నేలకొరిగాయి. నదులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి.

 తిరుమల, తిరుపతిలో కురుస్తున్న భారీ వర్షం

తిరుమల, తిరుపతిలో కురుస్తున్న భారీ వర్షం

తిరుమల తిరుపతిలో ఎన్నడూ లేనంత భారీ వర్షం కురిసింది. తిరుమల ఘాట్ రోడ్ లో కొండచరియలు, చెట్లు విరిగి పడటంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. గడచిన 50 ఏళ్లలో ఎప్పుడూ ఇటువంటి వర్షాన్ని చూడలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . భారీ వర్షాల కారణంగా చిత్తూరు జిల్లా కుప్పం నుండి తమిళనాడు లోని తిరుపతి వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి పోలీసులు మూసివేశారు. అంతర్రాష్ట్ర రహదారి మూసివేయడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. మరోవైపు తిరుమల తిరుపతిలో విపరీతంగా కురుస్తున్న భారీ వర్షాలతో భక్తులు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీటీడీ సాధ్యమైనంత త్వరగా పరిస్థితులు సాధారణ స్థితికి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తోంది. వరదల్లో చిక్కుకున్న భక్తులకు టీటీడీ సహాయం అందిస్తుంది.

AP Rains అల్లకల్లోలం Tirupati Flash Floods | Chittoor | Tirumala || Oneindia Telugu
 వరదల్లో ప్రాణాలు కోల్పోతున్న ప్రజలు .. వరద ప్రభావంతో రైళ్ళు రద్దు

వరదల్లో ప్రాణాలు కోల్పోతున్న ప్రజలు .. వరద ప్రభావంతో రైళ్ళు రద్దు

వరదల్లో చిక్కుకుని అనేక మంది గల్లంతయ్యారు. తాజాగా రాజంపేట వరదల్లో 12 మంది మృతి చెందగా, నందలూరు పరీవాహక ప్రాంతంలో 30 మంది చెయ్యేరు వరద ఉధృతిలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వరద ప్రభావిత జిల్లాల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకుండా కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకుంటున్న సీఎం జగన్ అధికారులకు సూచనలు సలహాలు అందిస్తున్నారు. ఇక మరోవైపు వరదల కారణంగా ఇప్పటికీ సికింద్రాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళవలసిన పలు రైళ్లను రద్దు చేయగా మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు.

English summary
PM Narendra Modi called Chief Minister YS Jagan on the flood situation in AP. Inquired about flood conditions in the state. Meanwhile, CM Jagan will conduct an aerial survey of the flood-affected areas on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X