Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వెంటాడుతున్న సునీత - అవినాశ్ మెడకు ఉచ్చు..!!

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి మెడకు ఉచ్చు బిగుస్తోంది. వైఎస్ వివేకా కేసులో ఉక్కిరి బిక్కిరి అయిన అవినాశ్ పై ఇప్పుడు సునీత మరో కేసుకు సిద్దమయ్యారు. ఇప్పటికే సోషల్ మీడియా పోస్టుల్లో ఎంపీ ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పుడు సునీత తాజా ఫిర్యాదుతో అవినాశ్ పైన తీసుకునే చర్యల పై ఉత్కంఠ పెరుగుతోంది.

పోలీసుల విచారణలో
వర్రా రవీందర్ రెడ్డి సోషల్ మీడియా పోస్టుల కేసులో ఇచ్చిన వాంగ్మూలం సంచలనంగా మారింది.
వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, వైఎస్ సునీతపై పెట్టిన పోస్టుల వెనుక ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవ రెడ్డి తనకు కంటెంట్ ఇచ్చారని రవీందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో, రాఘవరెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. అవినాశ్ రెడ్డి సూచనల మేరకే పీఏ రాఘవ రెడ్డి ఈ పోస్టులు పెట్టారని పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. దీంతో, రాఘవరెడ్డిని అరెస్ట్ చేసిన తరువాత ఈ కేసులో అవినాశ్ రెడ్డిని విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Police to investigate MP Avinash Reddy in Social media cases in Pulivendula

అవినాశ్ పై ఫిర్యాదు
అయితే, ఈ పోస్టుల విషయంలో సునీత, షర్మిల హైదరాబాద్ లో ఫిర్యాదు చేయటంతో తాము చర్యలు తీసుకోలేకపోయామని పోలీసులు చెబుతున్నారు. ఇక్కడ ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు ఉంటాయని వెల్లడించారు. పరారీలో ఉన్న అవినాష్‌ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని పట్టుకొని విచారిస్తే ఆయన ఇచ్చే వాంగ్మూలం ఈ కేసులో మరింత కీలకంగా మారనుంది. అయితే, వర్రా రవీందర్ రెడ్డి చెప్పిన అంశాలతో ఇప్పుడు సునీత నేరుగా ఎంపీ అవినాశ్ పైన ఫిర్యాదుకు సిద్దమయ్యారు. ఈ మేరకు ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చలు చేస్తున్నారు.

సునీత ఎంట్రీతో
పులివెందులలో నేరుగా అవినాశ్ పైన ఫిర్యాదు చేయాలని సునీత నిర్ణయించారు. అవినాష్‌ రెడ్డి పై ఏవిధంగా కేసు పెట్టాలనే అంశం పైన న్యాయనిపుణుల సలహా తీసుకున్నారు. అవినాష్ రెడ్డి ప్రమేయాన్ని నిర్ధారించే ఆధారాలను పోలీసులకు అందించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. అటు ఎంపీ రాఘవరెడ్డి.. ఇటు ఇప్పుడు సునీత చేసే ఫిర్యాదుతో అవినాశ్ మెడకు ఉచ్చు బిగిసినట్లేనని భావిస్తున్నారు. సునీత ఇచ్చే ఫిర్యాదులో పేర్కొనే అంశాలు.. ఆధారాలు అవినాశ్ పైన కేసుకు కీలకంగా మారనున్నాయి. దీంతో.. పులివెందులలో ఇప్పుడు అవినాశ్ విచారణ అంశం రాజకీయంగా ఉత్కంఠగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+