ఏపీలో మారుతున్న సమీకరణాలు..ఆ పార్టీకే మొగ్గు...?
ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రచారానికి మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో రాజకీయ పార్టీలన్నీకూడా విసృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. అభ్యర్థుల గెలుపు కోసం పార్టీల అధినేత గట్టిగానే శ్రమిస్తున్నారు. మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత పావులు కదుపుతున్నారు. జగన్‌ను గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన , బీజేపీ పార్టీలు జత కట్టాయి. తమదే అధికారం అంటే..లేదు లేదు మాదే అధికారమని ఇరు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పైకి అంతా బాగానే ఉన్నప్పటికీ లోలోపల మాత్రం నేతలు గెలుస్తామో లేదో అనే ఆందోళనకు గరవుతున్నారు. జగన్ ఒకవైపు మిగతా ప్రధాన పార్టీలన్నీ మరోవైపు ఉండటంతో ఎన్నికల యుద్ధంలో వైసీపీ గెలుస్తుందా? అనే చర్చ జరుగుతోంది. వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే ఏ చిన్న అవకాశాన్ని కూటమి వదులుకోకపోవడం లేదు. ఇరు పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించాయి. జగన్ ప్రకటించిన మేనిఫెస్టో కంటే కూటమి మేనిఫెస్టో అద్భుతంగా ఉన్నా ఆ మేనిఫెస్టో అమలు చేస్తారా లేదా అనుమానం వ్యక్తం అవుతోంది.

ప్రజలు ఏ మేనిఫెస్టోను నమ్ముతున్నారో చెప్పలేని పరిస్థితి. ఈసారి జరిగే ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. భార్యాభర్తలు ఒకే పార్టీకి ఓటు వేసే అవకాశంం తక్కువగా ఉందని సమాచారం అందుతోంది.మహిళల్లో ఎక్కువమంది జగన్‌కే మద్దతు ఇస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. సూపర్ సిక్స్ అమలు సాధ్యం కాదని జగన్ లెక్కలతో సహా చెబుతున్న పరిస్థితి. చంద్రబాబు చెప్పిన స్కీమ్స్ అమలు చేయాలంటే 1,65,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని వైసీపీ చెబుతోంది.
ఇది రాష్ట్ర బడ్జెట్ కంటే చాలా ఎక్కవ అని..మరీ పథకాలను ఎలా అమలు చేయగలుగుతారని కూటమిని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఈ స్కీమ్స్‌ను ఎలా అమలు చేస్తారో ఇప్పటికీ చెప్పడం లేదు. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు సంపద సృష్టించడం అనేది కలే అని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. నా పాలన చూసి ఓటు వేయమని జగన్ ప్రజలను అడుగుతుంటే..చంద్రబాబు మాత్రం తన గత పాలన చూసి ఓట్లు వేయండి అని చెప్పే సాహసం చేయలేకపోతున్నారు. అయితే చంద్రబాబుతో పవన్,బీజేపీలు జత కట్టడంతో లెక్కలు మారిపోతున్నాయి. అయితే ఈ ఎన్నికలు పోటాపోటీ అనేలా పరిస్థితులు ఉండబోతున్నాయని అనేది మాత్రం సుస్పష్టం. ఇటువంటి తరుణంలో చంద్రబాబు, జగన్‌లో ఎవరికి అధికారం దక్కుతుందో చూడాలి.
-
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా












Click it and Unblock the Notifications