మోడీతో భేటీ ఎందుకో తెలుసు: పవన్, నాగ్‌పై పొన్నం

పవన్ కళ్యాణ్‌కు అతనేం మాట్లాడుతున్నాడో అతనికే తెలియడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై మాట్లాడేముందు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని పవన్ కళ్యాణ్‌ను ఆయన హెచ్చరించారు. పవన్ కల్యాణ్‌కు రాజకీయాల గురించి ఓనమాలు కూడా తెలియదని పొన్నం అన్నారు. పవన్ కళ్యాణ్‌కు సినిమాలపై ఎంత ఆదాయం వస్తుందో ఆర్టీఐ ద్వారా తెలుకుంటానని చెప్పారు.
తెలంగాణలో విద్యుత్ సమస్యలను తీర్చాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తులపై మాట్లాడే స్థాయి తనకు లేదని పొన్నం తెలిపారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేకర్ రావు మేనిఫెస్టోపై కమిటీ స్పందిస్తుందని పొన్నం అన్నారు.
పొత్తులకు తలుపులు మూసేద్దామన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ చెప్పిన మాటే తన మాట అని పొన్నం అన్నారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications