Posani: పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం-ఇకపై నా దారి ఇదే..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ఆకాశమే హద్దుగా విపక్ష కూటమి నేతలపై రెచ్చిపోయిన వారందరికీ చుక్కలు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో వందల కొద్దీ సోషల్ మీడియా కార్యకర్తలు, పార్టీల నేతలపై కూటమి ప్రభుత్వం కేసులు పెడుతోంది. వీరిలో పలువురిని ఇప్పటికే అరెస్టులు కూడా చేసింది. ఈ క్రమంలోనే గత ప్రభుత్వంలో కూటమి పార్టీల నేతలపై రెచ్చిపోయిన మాజీ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్, నటుడు పోసాని కృష్ణమురళి కీలక నిర్ణయం తీసుకున్నారు.
రాజకీయాలకు గుడ్ బై చెబుుతున్నట్లు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి ఇవాళ హైదరాబాద్ లో ప్రకటించారు. ఇక నుంచి తాను రాజకీయాలు మాట్లాడనన్నారు. అలాగే ఇక నుంచి ఏ రాజకీయ పార్టీతో తనకు సంబంధం లేదని పోసాని ప్రకటించారు. వైసీపీనే కాదు ఇప్పటి వరకు ఏ పార్టీలో తనకు సభ్యత్వం లేదని కూడా ఆయన చెప్పేశారు. ఇక ఏ పార్టీని పొగడను, మాట్లాడను, విమర్శించనని తేల్చిచెప్పేశారు.

రాజకీయాలకు దూరంగా ఉండాలన్న నిర్ణయంపై స్పందిస్తూ.. తనను ఎవరూ ఏమనలేదని, ఎవరి గురించి ఇక మాట్లాడనని పోసాని కృష్ణమురళి వెల్లడించారు. గతంలో తాను ఓటర్ లాగే ప్రశ్నించానని, మంచి చేస్తే వాళ్లకి సపోర్ట్ చేశానని తెలిపారు. తన కుటుంబం, పిల్లల కోసం ప్రస్తుతం రాజకీయాలు వదిలేస్తున్నానని పోసాని కృష్ణమురళి చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఏపీలో పోసానిపై పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆయన నిర్ణయం సంచలనంగా మారింది.












Click it and Unblock the Notifications