పవన్ కల్యాణ్‌ను మూర్ఖత్వంతో పోల్చిన స్టార్ నటుడు
నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేశారు. తిరుమల లడ్డూ కల్తీ వివాదం చేలరేగినప్పటి నుంచి వీరి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై ప్రకాష్ రాజ్ రియాక్ట్ అవుతూ.. తిరుమల లడ్డూ కల్తీ వివాదాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారని, ఇది రాష్ట్ర సమస్య అని, మీరు అధికారంలో ఉన్నారని, నిజాలు బయటకు తీసి,బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రకాష్ రాజ్ పవన్ కల్యాణ్‌కు హితవు పలికారు. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ మండిపడ్డారు.
అసలు లడ్డూ వివాదానికి ప్రకాష్ రాజ్‌కు ఏం సంబంధం ఉందని మాట్లాడుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.నేను ఏ మతాన్ని తక్కువ చేసి మాట్లాడలేదని, అలాంటప్పుడు ప్రకాష్ రాజ్‌కు ఎందుకు ఈ వివాదంపై స్పందిస్తున్నారని పవన్ నిలదీశారు. అప్పటి నుంచి ప్రకాష్ రాజ్ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసుకుని ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ''గెలిచేముందు ఒక అవతారం... గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం... ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్?'' అంటూ ప్రకాష్ ట్వీట్ చేశారు.

తమిళనాడులో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశ్‌రాజ్ ఈ సందర్భంగా తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌పై ప్రశంసలు కురిపించారు.ఉదయనిధి స్టాలిన్ సమానత్వం గురించి మాట్లాడుతున్నారు. మరో డిప్యూటీ సీఎం సనాతన ధర్మం అంటూ తన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ పవన్ కల్యాణ్‌కు పరోక్షంగా చురకలు అంటించారు.నేను ప్రశ్నిస్తే భయపడుతున్నారు. నేను ఎప్పటికీ బలహీన వర్గాల తరఫున మాట్లాడతానంటూ ప్రకాశ్‌రాజ్ పేర్కొన్నారు. తాజాగా ఆయన మరోసారి పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
తాజాగా ఆయన ఏ ప్రముఖ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ పవన్ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ అంటే మీకెందుకు అంత కోపం అని మీడియా ప్రతినిధి ప్రకాష్ రాజ్‌ని ప్రశ్నించగా, దీనికి ఆయన సమాధానం ఇస్తూ..పవన్ కళ్యాణ్ మూర్ఖత్వంగా రాజకీయాలు చేస్తున్నారని ఆయన తెలిపారు. విధ్వంస రాజకీయాలకు పవన్ పాల్పడుతున్నారని ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. అది నచ్చట్లేదు. ప్రజలు అతడిని ఎన్నుకున్నది మతపరంగా విడదీసి విధ్వంస రాజకీయాలు చేయడానికి కాదు కదా అన్నారు. వీటిని ప్రశ్నించేవారు ఒకరు ఉండాలి కదా. అదే నేను చేస్తున్నానని ప్రకాష్ రాజ్ సమాధానమిచ్చారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌పై ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications