భారతదేశంలోని ఈ ఆలయాల్లో ప్రసాదాలు ప్రత్యేకం... అవి ఎంతో ఫేమస్!!
దేవాలయాలకు వెళ్తే అక్కడ ప్రసాదం పెడతారు. దేవాలయాలలో ఇచ్చే ప్రసాదాన్ని అమృతంగా భక్తులు స్వీకరిస్తారు. అయితే భారతదేశంలోని కొన్ని దేవాలయాలలో ప్రసాదాలు చాలా ప్రత్యేకతను సంతరించుకొని, ఫేమస్ గా నిలిచాయి. మరి ఏ దేవాలయాలలో ఎటువంటి ప్రసాదం ఫేమస్ గా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమలలో లడ్డూ అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది. తిరుపతి లడ్డు ఉండే రుచి, దేశంలోని మరే ఇతర ఆలయాల్లో ఉండే లడ్డూకు ఉండదు. తిరుమల లడ్డూలను జీడిపప్పు, కిస్మిస్లు వేసి ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సింహాచలం అప్పన్న ఆలయంలో పులిహోర, దద్ధోజనం ప్రసాదంగా పెడతారు.

అన్నవరంలో గోధుమ నూకతో తయారు చేసిన ప్రసాదం ఎంతో ఫేమస్. దీనిని భక్తులు ఇష్టంగా తింటారు. శ్రీకాళహస్తిలో పరమానాన్ని ప్రసాదంగా అందిస్తారు. అది ఇక్కడ ప్రత్యేకతగా చెబుతారు. భద్రాద్రి శ్రీ సీతారామ స్వామి ఆలయంలో పులిహోర, దద్ధోజనం చాలా ప్రత్యేకంగా ఉంటాయి.
కేరళలోని శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామి ప్రసాదం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. బియ్యం, బెల్లం, కొబ్బరి తో వండే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. ఈ ప్రసాదం కోసం అయ్యప్ప భక్తులను అడిగి తెప్పించుకునే వారు కూడా ఉంటారు. పళని సుబ్రమణ్య స్వామి ఆలయంలో అమృతపాణి అరటి పండ్లు, ఖర్జూరం, బెల్లం, నెయ్యి, యాలుకలతో తయారుచేసిన పంచామృతం ఎంతో అద్భుతంగా ఉంటుంది.

తిరువనంతపురంలోని గురువాయూర్ లో పాల పాయసం తయారు చేస్తారు. దీనిని భక్తులు మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. షిరిడి సాయినాథ్ సన్నిధిలో కోవా ప్రసాదంగా ఇస్తారు. దీన్ని తీసుకోవడాన్ని పరమ పవిత్రంగా చెబుతారు. త్రిసూర్ వడుక్కనాథన్ గుడిలోకి కొబ్బరి పూర్ణం చాలా ఫేమస్ గా చెబుతారు. పూరి జగన్నాథ్ ఆలయంలో కాజా ప్రసాదం చాలా విశేషమైనది. ఖర్చు ఎంతైనా భరించి ఆలయంలో తయారు చేసి అందిస్తారు.












Click it and Unblock the Notifications