అక్కడి నుంచి గెలిస్తే మంత్రి పదవి ఖాయం?
విశాఖపట్నంలోని భీమిలీ నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తే మంత్రి పదవి ఖాయమనే నమ్మకం రాజకీయ వర్గాల్లో నెలకొంది.
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు వైసీపీ, తెలుగుదేశం హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ వ్యూహాలకు ఇప్పటి నుంచే పదును పెడుతున్నాయి. ఇరు పార్టీల్లోని కీలక నేతలు ఎక్కడినుంచైతే సులువుగా విజయం సాధిస్తామా? అంటూ నియోజకవర్గాల వేటలో మునిగిపోయారు. తమకు సీటు వస్తుందా? రాదా? అన్న అనుమానం ఉన్నవారు మాత్రం సైలెంటయ్యారు.

భీమిలీ నుంచి విజయం సాధిస్తే..
విశాఖపట్నంలోని భీమిలీ నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తే మంత్రి పదవి ఖాయం అనే నమ్మకం రాజకీయ వర్గాల్లో రోజురోజుకు పెరుగుతోంది. 2024 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీచేసేందుకు ఇరుపార్టీల్లోను పలువురు అభ్యర్థులు పోటీపడుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ తరఫున గంటా శ్రీనివాసరావు, వైసీపీ తరఫున మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పోటీదారులుగా ఉన్నారు. వచ్చే ఎన్నికలకు భీమిలీ నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు సీటు వస్తుందా? రాదా? అనే మీమాంస వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. కానీ సీటు తనకే కచ్చితంగా ఇస్తారని, విజయం సాధిస్తానని, మరోసారి మంత్రినవుతానంటూ తన అనుయాయులకు ఆయన చెబుతున్నారు.

గత ఎన్నికలకు ముందు పార్టీ మారిన అవంతి
గంటా శ్రీనివాసరావు గత ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. వైసీపీ అధికారంలోకి రావడంతో సైలెంటయ్యారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారతారనే ప్రచారాన్ని నిజం చేస్తూ వైసీపీలోకి వెళ్లడానికి ప్రయత్నించగా అవంతి శ్రీనివాస్ రానివ్వకుండా నిలవరించారు. ఒకప్పుడు వీరిద్దరూ మిత్రలు కావడం విశేషం. 2019 ఎన్నికలకు ముందు అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరి భీమిటీ టికెట్ దక్కించుకున్నారు. పోటీచేసిన ప్రతిసారీ నియోజకవర్గాన్ని మార్చే గంటా శ్రీనివాసరావు ఈసారి భీమిలీ నుంచి పోటీచేయాలనే దృక్పథంతో ఉన్నారు. ఇటీవలే నారా లోకేష్ ను కలిసిన గంటా తాను టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

నియోజకవర్గంలో గట్టి పట్టున్న గంటా
భీమిలీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టుంది. అలాగే గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. దీంతో రాబోయే ఎన్నిక హోరాహోరీగా జరగబోతోందని స్పష్టమవుతోంది. అందులోను గంటా శ్రీనివాసరావు భీమిలీలో తనకు అనుచరవర్గం ఎక్కువ ఉండటం, నియోజకవర్గంపై గట్టి పట్టుండటంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఒకప్పటి మిత్రలైన గంటా, అవంతి మధ్య ఇక్కడ పోరు కూడా భీకరంగా సాగే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications