పులివెందులలో ఆ పార్టీకి కనీసం 15,000 మెజారిటీ: బెట్టింగ్ రాయుళ్ల భారీ అంచనాలు

కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికల రాజకీయం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో ఈ స్థానిక సమరం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ0ఆకర్షిస్తోంది. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వస్తోన్న పులివెందులలో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని తెలుగుదేశం భావిస్తోండటంతో అక్కడి వాతావరణం హీటెక్కింది.

ఈ ఎన్నికలను రెండు పార్టీలు కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయక్కడ. ఈ క్రమంలో పులివెందుల మున్సిపల్ పోరులో వైఎస్ ప్రమిళమ్మను బరిలోకి దించింది. టీడీపీ నుంచి టీ గీతా కుమారి రేసులో నిలిచారు. నామినేషన్ సమయంలోనే వైసీపీ తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొనాల్సి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పోలీసులే తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయకుండా అడ్డుపడుతున్నారంటూ వైసీపీ ఆరోపిస్తోంది.

Pulivendula Election Buzz as a Big Betting Swings Toward TDP and YSRCP voters weigh possible outcomes

ఈ పరిణామాల మధ్య పోలింగ్ సజావుగా సాగితే ఎవరు గెలుస్తారనేది చర్చనీయాంశమౌతోంది. మొత్తం 40 వార్డుల పరిధిలో సుమారు 65,000 ఓటర్లు ఉన్నారు. ఎన్నికల బరిలో కనీసం 15,000 పైగా ఓట్ల మెజారిటీ సాధించి తమ బలాన్ని నిరూపించుకుంటామని టీడీపీ శ్రేణులు ధీమాగా చెబుతున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో స్థానిక మున్సిపాలిటీపై కూడా జెండా ఎగరవేసి సరికొత్త రాజకీయాన్ని ప్రారంభించాలని టీడీపీ నాయకులు ప్రత్యేక వ్యూహాలు పన్నుతున్నారు.

శబరిమల, మలికాపురం ఆలయాల ప్రధాన అర్చకులుగా..
శబరిమల, మలికాపురం ఆలయాల ప్రధాన అర్చకులుగా..

పులివెందుల ఎన్నికల వేడి వార్డులకే పరిమితం కావట్లేదు. ఇరు ప్రధాన పార్టీల ప్రతిష్ట ఈ ఎన్నికలపైనే ఆధారపడి ఉండటంతో గెలుపోటములపై రాజకీయ విశ్లేషకులు, సాధారణ ప్రజల్లోనూ రకరకాల అంచనాలు నెలకొన్నాయి. అదే సమయంలో స్థానికంగా పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు సైతం నడుస్తోన్నట్లు సమాచారం అందుతోంది. మెజారిటీ బెట్టింగ్ రాయుళ్లు టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గీతాకుమారి విజయం తథ్యమని, 15,000కు పైగా మెజారిటీతో ఆమె గెలుస్తారంటూ పందెం కడుతున్నట్లు సమాచారం.

మిథున్ రెడ్డి, వైసీపీ మాజీ ఎంపీ, మరో 70 మందిపై ఎఫ్ఐఆర్
మిథున్ రెడ్డి, వైసీపీ మాజీ ఎంపీ, మరో 70 మందిపై ఎఫ్ఐఆర్

సొంత గడ్డపై తమ పట్టు సడలకుండా వైఎస్ ప్రమిళమ్మ గెలుపు కోసం వైసీపీ శ్రేణులు రాత్రింబవళ్లు శ్రమిస్తోండగా, దీనికి భిన్నంగా టీడీపీ ప్రణాళికలు పన్నుతోంది. ఓటర్లు ఇవ్వబోయే తీర్పు పులివెందులలో వైఎస్ కుటుంబం ఆధిపత్యం కొనసాగుతుందా, లేక టీడీపీ ప్రణాళికల ప్రకారం.. మార్పులకు బాటలు వేస్తుందా అనేది త్వరలోనే తేలనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+