శబరిమల, మలికాపురం ఆలయాల ప్రధాన అర్చకులుగా..

శబరిమల శ్రీధర్మశాస్త అయ్యప్ప ఆలయానికి నూతన మేల్‌శాంతి ఎంపిక ప్రక్రియ పూర్తయింది. రాబోయే వార్షిక మండల-మకరవిళక్కు యాత్ర సీజన్‌కు ముందు దేవాదాయ బోర్డు అధికారుల సమక్షంలో డ్రా పద్ధతి ద్వారా ఈ ఎంపిక నిర్వహించారు. శబరిమల అయ్యప్ప స్వామి ప్రధాన పూజారిగా అరిక్కర సుబ్రహ్మణ్యన్ శంకరన్ నంబూద్రి, మాలికాపురం దేవి ఆలయ ప్రధాన పూజారిగా దామోదరన్ నంబూద్రి ఎంపికయ్యారు.

పథనంథిట్ట జిల్లాలోని శబరిమల సన్నిధానంలో ఈ ఉదయం పూజల అనంతరం ఈ లాటరీ ప్రక్రియను చేపట్టారు. శబరిమల మేల్‌శాంతి పదవికి మొత్తం ఏడుమంది అభ్యర్థులు తుది పోటీలో నిలిచారు. లాటరీ ద్వారా సుబ్రహ్మణ్యన్ శంకరన్ నంబూద్రి, దామోదరన్ నంబూద్రి పేర్లు వెల్లడయ్యాయి. వీరిద్దరూ కూడా నవంబర్ 16వ తేదీన బాధ్యతలు స్వీకరిస్తారు. ఆ మరుసటి రోజు నుంచే మండల పూజల కోసం శబరిమల ఆలయ తలుపులు తెరుచుకంటాయి. వీరి పదవీకాలం సంవత్సరం పాటు కొనసాగుతుంది.

Subrahmanyan Sankaran Namboothiri was selected as the new melsanthi of Sabarimala sannidhanam

తిరువనంతపురం జిల్లాకు చెందిన సుబ్రహ్మణ్యన్ శంకరన్ నంబూద్రి ప్రస్తుతం ప్రసిద్ధ పళవంగాడి గణపతి ఆలయంలో మేల్‌శాంతిగా సేవలందిస్తోన్నారు. గత 21 సంవత్సరాలుగా ఆయన వివిధ ప్రముఖ ఆలయాల్లో పూజారిగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం కలిగి ఉన్నారు. గతంలో ఢిల్లీ ఆర్ కే పురం అయ్యప్ప ఆలయం, నెడుమంగాడ్ భగవతి ఆలయం, తైక్కాడు శాస్తా ఆలయాల్లో ఆయన అర్చకుడిగా విధులు నిర్వహించారు.

స్పిరిట్.. ప్రభాస్ నెవెర్ బిఫోర్ అవతార్: విడుదల తేదీ లాక్: సడన్ సర్‌ప్రైజ్‌
స్పిరిట్.. ప్రభాస్ నెవెర్ బిఫోర్ అవతార్: విడుదల తేదీ లాక్: సడన్ సర్‌ప్రైజ్‌

మాలికాపురం ఆలయ మేల్‌శాంతిగా ఎంపికైన దామోదరన్ నంబూద్రి కోజికోడ్ జిల్లా వటాకార ప్రాంతానికి చెందినవారు. ప్రస్తుతం ఆయన పయ్యోళిలోని కీళూర్ శివాలయంలో ప్రధాన పూజారిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం శబరిమల మేల్‌శాంతిగా ప్రసాద్, మాలికాపురం మేల్‌శాంతిగా మను నంబూద్రి సేవలందిస్తోన్నారు. వారిద్దరి పదవీకాలం నవంబర్ 15వ తేదీ నాటికి ముగియనుంది. ఆ వెంటనే శంకరన్ నంబూద్రి, దామోదరన్ నంబూద్రి బాధ్యతలను స్వీకరిస్తారు.

పండగ వేళ బంగారం ధరల ట్రెండ్ అనూహ్యం.. !!
పండగ వేళ బంగారం ధరల ట్రెండ్ అనూహ్యం.. !!

దీనిపై సుబ్రహ్మణ్యన్ శంకరన్ నంబూద్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. పళవంగాడి గణపతి స్వామి ఆశీస్సులు, గురువుల దీవెనల వల్లే తనకు ఈ అవకాశం దక్కిందని పేర్కొన్నారు. పళవంగాడి ఆలయం ఆర్మీ పరిధిలో ఉండటం వల్ల ప్రత్యేక అనుమతి సాధించి దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. అయ్యప్ప భక్తులకు నమ్మకంతో, నిజాయితీతో సేవ చేయడమే తన ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు.

అటు శబరిమల మండలం- మకరవిళక్కు యాత్రా కాలం త్వరలో ప్రారంభం కానుండటంతో ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది. లక్షలాది మంది అయ్యప్ప స్వామి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు, పూజా కార్యక్రమాలను పక్కాగా నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+