సీఈసీ, ఎస్ఈసీల ఎంపిక అలా జరగాల్సిందే..! జగన్ కీలక డిమాండ్..!

కేంద్ర ఎన్నికల కమిషనర్లతో పాటు రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ నియామకానికి అనుసరిస్తున్న ప్రక్రియపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఈసీ అయినా, ఎస్ఈసీ అయినా నియామకాలు తటస్థంగా జరగాలని, ప్రభుత్వాల్లో ఉన్న వారు తమకు కావాల్సిన వారిని నామినేట్ చేసుకుని, వారి సాయంతో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉండకూడదని జగన్ తెలిపారు. గతంలో కేంద్రంలో ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం విషయంలో చేసిన తప్పుపై పశ్చాత్తాపపడుతున్నామని వెల్లడించారు. అందుకే ఇప్పుడు ఈసీల నియామకం విషయంలో పారదర్శకత కోరుతున్నట్లు తెలిపారు.

ఏబీ పోటీ వెనుక చంద్రబాబు ? జగన్ ఇండీ పాలిటిక్స్- సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్..!
ఏబీ పోటీ వెనుక చంద్రబాబు ? జగన్ ఇండీ పాలిటిక్స్- సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్..!

2024 ఎన్నికల ఫలితాలు తారుమారయ్యాయని అప్పటి నుంచే చెప్తున్నామని జగన్ గుర్తుచేశారు. దీనిపై కోర్టుల్లో కేసులు కూడా వేశామన్నారు. ప్రజాస్వామ్యవాదులు చాలా మంది ఆంధ్రప్రదేశ్ లో జరిగిన తప్పుల్ని ప్రస్తావిస్తూ ఇంటర్వూల్లో చెప్పారని తెలిపారు. ఈ వ్యవస్ధలోకి మార్పు అనేది రావాలని, పారదర్శకంగా నియామకాలు జరగాలని కోరారు. ఎస్ఈసీ కానీ, సీఈసీ నియామకాలు తటస్ధంగా జరగాలన్నారు. అధికార పార్టీలు వీరిని నామినేట్ చేసే పరిస్ధితి రాకూడదన్నారు. గతంలో మేం కూడా ఇలా నామినేట్ చేసేందుకు మద్దతిచ్చి తప్పు చేసినట్లు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నామన్నారు.

YS Jagan Flags Bias in Election Commissioner Appointments Calls for Neutral Selection Process

విద్యార్ధి ఎగ్జామినర్ ను అపాయింట్ చేయలేడని, ఎగ్జామినర్ ఎంత నిజాయితీ పరుడైనా విమర్శల్ని ఎదుర్కోక తప్పదని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ తటస్థ ఎన్నికల సంఘం రావాలన్నారు. విపక్ష నేత, సీజేఐ , ప్రధాని ముగ్గురూ ఓటేస్తేనే తటస్థ ఎన్నికల సంఘం వస్తుందన్నారు. ప్రధాని, ఆయన నామినేట్ చేసే మంత్రి, విపక్ష నేత కలిసి ఎన్నికల సంఘాన్ని ఎన్నుకోవడం వ్యవస్ధలో ఉన్న లోపమన్నారు. ఇది మారాలన్నారు. రెండు ఓట్లు ఒకరికే పడతాయి కాబట్టి సీఈసీ కానీ, ఎస్ఈసీలు కానీ ప్రభుత్వంలో ఉన్న వారే ఎంచుకుంటున్నారని జగన్ గుర్తుచేశారు. ఈ లోపం మారే వరకూ ఈ వ్యవస్థ బాగుపడదన్నారు.

YS Jagan Flags Bias in Election Commissioner Appointments Calls for Neutral Selection Process
హింసను అడ్డుకోలేని ఎస్ఈసీ..! చంద్రబాబు వీరవిధేయుడు- పునేఠాపై జగన్ ఫైర్..!
హింసను అడ్డుకోలేని ఎస్ఈసీ..! చంద్రబాబు వీరవిధేయుడు- పునేఠాపై జగన్ ఫైర్..!

తాము కూడా తప్పులు చేశాకే గ్రహించామన్నారు. అందుకే ఇప్పుడు మార్పులు కోరుతున్నట్లు జగన్ తెలిపారు. ప్రతీ ప్రజాస్వామ్య వాదీ దీన్ని అడగాలి. అప్పుడే ఎన్నికల ప్రక్రియపై నమ్మకం పెరుగుతుందన్నారు. కేంద్రంలో ఉన్న విధానమే రాష్ట్రంలోనూ ఎస్ఈసీ ఎంపికలో రావాలని, ముఖ్యమంత్రి, హైకోర్టు సీజే, విపక్ష నేత కలిపి ఎస్ఈసీని ఎన్నుకోవాలని కోరారు. ఇది భవిష్యత్తులో కచ్చితంగా జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్యం ఇలా ఖూనీ అవుతుంటే సంస్కరణల అవసరం కనిపిస్తోందన్నారు. గతంలో నిమ్మగడ్డ హయాంలో తాము ఎన్నికలు నిర్వహించడం వల్ల అప్పట్లో ఎవరికీ తేడా తెలియలేదన్నారు. చంద్రబాబు ఒకరిని నియమించి, ఆయన ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరిగితే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుస్తోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+