కాకినాడ ఆర్టీసీ బస్సులో దారుణం.. సీటుకోసం ఫైట్.. మహిళలపై కర్రలు, రాడ్లతో దాడి!

కాకినాడ జిల్లాలో ఆర్టీసీ బస్సులో జరిగిన దారుణ ఘటన అందరినీ షాక్ కి గురి చేసింది. సీటు వివాదం చిలికి చిలికి గాలివానగా మారి, చివరికి మహిళలపై కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేసే దిశగా దారితీసింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా మారింది.

అక్టోబర్ 18 రాత్రి ఏలేశ్వరం మండలం చిన్నంపేట వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. తుని నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సీటు విషయంలో మహిళల మధ్య వాగ్వాదం మొదలైంది. రాజమండ్రికి చెందిన మహిళలు, సిరిపురం గ్రామానికి చెందిన మరో మహిళ మధ్య గొడవ జరిగింది. తనను కొట్టారని ఆ మహిళ తన భర్తకు ఫోన్ చేసి చెప్పింది.భర్త ఆగ్రహంతో సిరిపురం గ్రామం నుంచి సుమారు 30 మంది యువకులను తీసుకొని చిన్నంపేట జాతీయ రహదారిలో బస్సును ఆపారు.

Kakinada RTC bus attack Shocking Attack on Women in Kakinada RTC Bus Over Seat Dispute Youth Beat Them with Sticks and Rods

కర్రలు, ఇనుప రాడ్లతో బస్సులోకి చొరబడి మహిళలపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో రాజమండ్రికి చెందిన ఒక వ్యక్తితో పాటు ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వారిని కాకినాడ ఆసుపత్రికి తరలించారు. భయాందోళనకు గురైన బాధితులు వెంటనే 112 పోలీస్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేశారు. ఏలేశ్వరం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేలోపు దాడికి కారణమైన మహిళ, ఆమె భర్త అక్కడి నుంచి పారిపోయారు.

బాధితులు, బస్సు డ్రైవర్, కండక్టర్ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడికి పాల్పడిన వారిలో కొందరు మద్యం, గంజాయి సేవించి ఉన్నారని బాధితులు ఆరోపించారు. సీటు వివాదం కాస్త హింసకు దారి తీయటం స్థానికంగా చర్చకు కారణం అయ్యింది. బస్సులో ప్రయాణించేటప్పుడు గొడవలు జరిగితే వెంటనే కండక్టర్ లేదా డ్రైవర్‌కు సమాచారం ఇవ్వడం, 112కు కాల్ చేయడం మంచిది.

నేడు, రేపు ఏపీ, తెలంగాణాలలో వర్షాలు కురుస్తాయన్న బంగాళాఖాతం!
నేడు, రేపు ఏపీ, తెలంగాణాలలో వర్షాలు కురుస్తాయన్న బంగాళాఖాతం!

సిసిటివి కెమెరాలు ఉన్న బస్సుల్లో ఇలాంటి ఘటనలు రికార్డ్ అవుతాయి కాబట్టి నిందితులను పట్టుకోవడం సులభం అవుతుంది. పోలీసులు దర్యాప్తు వేగంగా చేపట్టి నిందితులను అరెస్టు చేయాలని బాధితుల కుటుంబాలు కోరుతున్నాయి. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు సురక్షితంగా ఉండాలని అధికారులు కూడా హామీ ఇస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+