మొదటి భర్తను వదిలేసింది.. రెండో మొగుడిని చంపేసింది.. చివరకు!

హర్యానాలోని ఫరీదాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన గోపాల్(36) హత్య కేసును స్థానిక పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. కట్టుకున్న భర్తనే భార్య తన ప్రియుడితో కలిసి పథకం ప్రకారం రాత్రి వేళ దారుణంగా మెడకొసి హత్య చేసినట్లు విచారణలో తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలైన భార్య కాజల్, ఆమె ప్రియుడు యోగేందర్ లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ముంచెత్తిన వాన: నాలుగేళ్ల నిరీక్షణ నీటిపాలు!
ముంచెత్తిన వాన: నాలుగేళ్ల నిరీక్షణ నీటిపాలు!

తొలి పరిచయం నుంచి ప్రేమ వివాహం వరకు..
ఉత్తరప్రదేశ్ హాథ్రస్ జిల్లా కుండవర్‌పూర్‌కు చెందిన గోపాల్ గత 20 ఏళ్లుగా ఫరీదాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో మెషీన్ ఆపరేటర్‌గా జీవనం సాగిస్తున్నాడు. సుమారు 16 ఏళ్ల క్రితం ఒకే కంపెనీలో పనిచేస్తున్న క్రమంలో కాజల్‌తో అతనికి పరిచయం ఏర్పడింది. అంతకుముందే వివాహమై ఐదేళ్ల కూతురు ఉన్న కాజల్, గోపాల్‌తో ప్రేమలో పడి మొదటి భర్తను విడిచిపెట్టి అతడితో వచ్చేసింది. ఆపై వీరిద్దరూ కోర్టులో చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఊరిలో ఇల్లు నిర్మించిన గోపాల్, కుటుంబాన్ని హాథ్రస్‌లోనే ఉంచి తాను మాత్రం ఉద్యోగం నిమిత్తం ఫరీదాబాద్‌లో నివాసముంటున్నాడు.

Faridabad Crime Woman Kills 2nd Husband with Lover Help Police cracked the case and arrested both

సంసారంలో నిప్పులు పోసిన బౌన్సర్ పరిచయం
దాదాపు మూడేళ్ల క్రితం గ్రామంలోని వీరి ఇంటికి 500 మీటర్ల రూపంలో ఉండే యోగేందర్ అనే బౌన్సర్‌తో గోపాల్‌కు పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా యోగేందర్ తరచూ గోపాల్ ఇంటికి వచ్చేందుకు దారితీసింది. అయితే గోపాల్ ఫరీదాబాద్లో ఉద్యోగానికి వెళ్లిన సమయంలో కూడా యోగేందర్ ఇష్టానుసారంగా ఇంటికి రావడంపై దంపతుల మధ్య తీవ్ర వివాదాలు చెలరేగాయి. ఈ మనస్పర్థల కారణంగానే గత కొద్ది నెలలుగా గోపాల్ గ్రామానికి వెళ్లడం కూడా మానేశాడు.

భర్తను చంపి మంచంపై పాము: భార్య, ప్రియుడికి ఉరిశిక్ష
భర్తను చంపి మంచంపై పాము: భార్య, ప్రియుడికి ఉరిశిక్ష

పక్కా పథకంతోనే హత్య
భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న కాజల్.. ప్రియుడు యోగేందర్‌తో కలిసి హత్యకు కుట్ర పన్నింది. ప్లాన్ ప్రకారం అక్టోబర్ 13న పిల్లలతో కలిసి ఫరీదాబాద్‌లోని భర్త వద్దకు వచ్చింది. మరుసటి రోజే అక్టోబర్ 14న ప్రియుడు యోగేందర్‌ను కూడా అక్కడికే రప్పించింది. అక్టోబర్ 14-15 అర్ధరాత్రి సమయంలో తీవ్ర మద్యం మత్తులో గోపాల్ నిద్రపోతున్న సమయంలో కాజల్ కూరగాయలు కోసే కత్తితో అతడి మెడపై తీవ్రంగా దాడి చేసి దారుణంగా కోసేసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో గోపాల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

దొంగల నాటకం భగ్నం
హత్య అనంతరం పోలీసులను దారి మళ్లించేందుకు కాజల్ కొత్త నాటకానికి తెరతీసింది. అర్ధరాత్రి వేళ ఇళ్లలోకి దుండగులు చొరబడి భర్తపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, సేకరించిన సాంకేతిక ఆధారాల ఆధారంగా పోలీసులు కాజల్‌ను తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. యోగేందర్ సహకారంతోనే ఈ హత్య చేసినట్లు కాజల్ అంగీకరించడంతో ఇద్దరిపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఫరీదాబాద్ పోలీస్ పీఆర్వో యశ్‌పాల్ సింగ్ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+