వందేభారత్ ప్రయాణీకులకు బిగ్ అప్డేట్ - ఇక నుంచి..!!

తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ కు డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం నడుస్తున్న వాటితో పాటుగా కొత్త రైళ్ల కోసం ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. వందేభారత్ స్లీపర్ ను ప్రవేశ పెడుతున్న వేళ తెలుగు రాష్ట్రాలకు కేటాయింపుల పైన రైల్వే శాఖ పైన ఒత్తిడి పెరుగుతోంది. దీంతో, తొలి దశ లోనే విశాఖ నుంచి తిరుపతికి వందేభారత్ స్లీపర్ కేటాయింపు దాదాపు ఖరారైంది. ఇదే సమయంలో వందేభారత్ నిర్వహణలో రైల్వే అధికారులు తాజాగా కీలక ప్రతిపాదనలు చేసారు.

వందేభారత్ కోచ్ లు పెంపు
తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్ నుంచి విశాఖకు తొలి వందేభారత్ రైలు ప్రారంభమైంది. నాటి నుంచి నిత్యం ఈ రైలుకు డిమాండ్ కొనసాగుతోంది. తాజాగా ఈ రైలు సెలవులోనూ మార్పు చేసారు. ఇక, ఈ రైలుకు పెరుగుతున్న ఆక్యుపెన్సీతో వాల్తేరు డివిజన్ అధికారులు రైల్వే బోర్డుకు కీలక ప్రతిపాదన చేసారు. కొత్తగా మరో నాలుగు కోచ్ లు ఈ రైలు కోసం మంజూరు చేయాలని కోరారు. దీని పైన సానుకూల స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. మరో నెల రోజుల్లోనే ఈ రైలుకు నాలుగు కొత్త కోచ్ లు జత చేరే అవకాశం కనిపిస్తోంది.

Railway officials proposed for additional coaches for Visakha - Secunderabad vandebharat

కొత్త డిమాండ్లు
దీని ద్వారా ఈ రైలు కోసం నిత్యం కొనసాగుతున్న వెయిటింగ్ లిస్టు తగ్గించే ఛాన్స్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో కొత్తగా వస్తున్న వందేభారత్ స్లీపర్ రైళ్ల కోసం డిమాండ్లు తెర పైకి వస్తున్నాయి. ఈ నెలలోనే రైల్వే శాఖ రూపొందించిన వందేభారత్ స్లీపర్లు పట్టాలెక్కనున్నాయి. తొలి ప్రాధాన్యత లో భాగంగా తెలుగు రాష్ట్రాలకు ఒకటి కేటాయించే అవకాశం ఉంది. దీంతో, విశాఖ నుంచి తిరుపతి కి కేటాయించేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి రెగ్యులర్ వందేభారత్ నడుస్తోంది.

రైల్వే శాఖ పరిశీలన
అదే విధంగా విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్ స్లీపర్ కేటాయించాలనే ఎంపీల ప్రతిపాదనలు రైల్వే శాఖ వద్ద పరిశీలనలో ఉన్నాయి. వీటి పైన ీ నెల 6న చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవానికి రానున్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఇక, విశాఖ రైల్వే జోన్ కు ప్రధాని ఈ నెల 8న శంకుస్థాపన చేయనున్నారు. అయితే, విశాఖ రైల్వే జోన్ కూర్పు పైన మాత్రం అధికారులు ఇంకా డైలమాలోనే ఉన్నారు. వాల్తేరు డివిజన్ ను విశాఖ రైల్వే జోన్ లో కలుస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టత రావటం లేదు. ప్రధాని పర్యటన లోగా దీని పైన రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+