ఏపీకి రైల్వే భారీ గుడ్ న్యూస్, చర్లపల్లి తరహా టెర్మినల్ - ప్రత్యేకంగా వందేభారత్..!!

ఏపీ కేంద్రంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అమరావతిలో అతి పెద్ద రైల్వే స్టేషన్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇక.. ఇప్పుడు ఈ ప్రాజెక్టు దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. అమరావతి - గన్నవరంలో రైల్వే టెర్మినల్ కోసం భూ కేటాయింపుల పైన ప్రతిపాదనలు అందాయి. ఇదే సమయం లో విజయవాడ ..గుంటూరు రైల్వే స్టేషన్ల విస్తరణకు నిర్ణయించారు.

అమరావతి కేంద్రంగా మెగా రైల్వే టెర్మినల్ నిర్మాణానికి కసరత్తు మొదలైంది. 8 ప్లాట్‌ఫాంలతో ఈ టెర్మినల్‌ను రూపుదిద్దుకోనుంది. రైళ్ల నిర్వహణకు అవసరమైన సదుపాయాలకోసం ప్రత్యేక పిట్ లైన్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. రాజధాని మీదుగా ఎర్రుపాలెం-నంబూరు మధ్య 56 కి.మీ. పొడవున కొత్త రైల్వే లైన్ నిర్మాణం జరుగనుంది. ఈ మార్గంలో అమరావతిని ప్రధాన స్టేషన్‌గా రూపొందించి, దానిని మెగా కోచింగ్ టెర్మినల్‌గా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్దం చేసారు. రైళ్ల కోచ్‌ల నిర్వహణ పనులు కూడా కొనసాగేలా అమరావతిలో టెర్మినల్‌ నిర్మాణానికి నిర్ణయించారు. ఈ టెర్మినల్‌లో 8 రైల్వే లైన్లు, 8 ప్లాట్‌ఫాంలు నిర్మించనున్నారు. ఒక్కో ప్లాట్‌ఫాంపై 24 ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల రైళ్లు నిలిపేలా సదుపాయాలు కల్పిస్తారు. ఈ స్టేషన్ 120 రైళ్ల రాకపోకలకు తగిన సామర్థ్యం కలిగి ఉంటుంది.

railway-planning-for-new-terminal-at-amaravati-and-gannavaram-expansion-of-stations

అదే విధంగా రైళ్ల నిర్వహణ కోసం 6 పిట్ లైన్లు నిర్మించనున్నారు. వాటిలో ఒకటి ప్రత్యేకంగా వందే భారత్ రైలు కోసం ఉంటుంది. ఈ టెర్మినల్ కోసం మొత్తం 300 ఎకరాల భూమిని రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. గన్నవరం రైల్వే స్టేషన్‌ను విజయవాడకు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం మూడు ప్లాట్‌ఫాంలు ఉన్న ఈ స్టేషన్‌లో భవిష్యత్‌లో 10 ప్లాట్‌ఫాంలు, 10 రైల్వే లైన్లు ఏర్పాటు చేయనున్నారు.

సికింద్రాబాద్ స్టేషన్‌పై ఒత్తిడి తగ్గించేందుకు చర్లపల్లి వద్ద టెర్మినల్‌ను అభివృద్ధి చేసినట్టే, గన్నవరం టెర్మినల్‌ను కూడా మెగా స్థాయిలో నిర్మించనున్నారు. ఈ టెర్మినల్ నుంచి 205 రైళ్ల రాకపోకలు జరగనున్నాయి. రైళ్ల నిర్వహణకు వీలుగా 4 పిట్ లైన్లు నిర్మిస్తారు. ఈ మెగా టెర్మినల్‌కి 143 ఎకరాల భూమిని రైల్వే శాఖ కోరింది. విజయవాడ, గుంటూరు స్టేషన్లలో లైన్లను విస్తరించనున్నారు. గుంటూరు రైల్వే స్టేషన్‌లో ప్రస్తుతం 7 ప్లాట్‌ఫాంలు ఉన్నాయి. అదనంగా మరో ప్లాట్‌ఫాంను నిర్మించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+