ఏపీ, తెలంగాణకు మళ్ళీ వరుణుడి హెచ్చరిక!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కూడా సంభవిస్తాయని హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. దీనివల్ల రాష్ట్రంలో వాతావరణం మారుతోంది.అమరావతి వాతావరణ కేంద్రం జారీ చేసిన సూచన ప్రకారం, కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు కూడా సంభవించవచ్చు.

Rain Alert for Andhra Pradesh and Telangana Light to Moderate Showers Expected for Next 3 Days

గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక్కడ కూడా బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, రాబోయే మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి వానలు పడే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు, ఈదురుగాలులు కూడా బలంగా వీచవచ్చు. ఇటీవల వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురిసిన తర్వాత కొంతకాలం వర్షాలు లేకపోయాయి. ఇప్పుడు మళ్లీ కొన్ని ప్రాంతాల్లో వానలు మొదలవుతాయని అంచనా. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

చెన్నై- న్యూ ఢిల్లీ రూట్లో బల్లార్షా- గూడూరు నాలుగో రైల్వే లైన్ పై కేంద్రం శుభవార్త!
చెన్నై- న్యూ ఢిల్లీ రూట్లో బల్లార్షా- గూడూరు నాలుగో రైల్వే లైన్ పై కేంద్రం శుభవార్త!

మత్స్యకారులు చేపల వేటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. బయటకు వెళ్లేటప్పుడు గాలులు, మెరుపుల పట్ల జాగ్రత్త వహించాలి. రైతులు పంటల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. మొత్తంగా రాబోయే మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం కొంత తడిగా ఉండే అవకాశం ఉంది. తేలికపాటి వర్షాలు పంటలకు మేలు చేస్తాయని అంచనా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+