గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వెంకన్నకూ కులమా? ఏపీలో కన్నడ రిపీట్: చంద్రబాబుపై రాంమాధవ్ నిప్పులు

|
Google Oneindia TeluguNews

గుంటూరు: ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ఒరవడిని సృష్టించాలని ఆ పార్టీ జాతీయ నేత రాంమాధవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గుంటూరు సిద్ధార్థ్‌ గార్డెన్స్‌లో మోడీ ప్రభుత్వ విజయోత్సవ సభలో కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సభలో రాంమాధవ్ మాట్లాడుతూ.. ఏపీలో టీడీపీ లాంటి వారసత్వ పార్టీలకు స్వస్తి పలకాలని అన్నారు.

తిరుపతి సభలో నరేంద్ర మోడీ.. సీమాంధ్రను స్కామాంధ్రగా మారిస్తే సహించబోమని చెప్పారని రాంమాధవ్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే.. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ పార్టీతోనే అంటకాగుతున్నారని ధ్వజమెత్తారు.

అనరాని మాటలు అంటున్నా ఏపీ కోసం..

అనరాని మాటలు అంటున్నా ఏపీ కోసం..

ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన టీడీపీ ఇప్పుడు హోదా పేరుతో బీజేపీపై దుష్ప్రచారం చేస్తోందని రాంమాధవ్ మండిపడ్డారు. తమది నిజాయితీ గల ప్రభుత్వమని, అన్ని వర్గాలకు దగ్గరైన ప్రభుత్వమని అన్నారు. అనరాని మాటలు అంటూ మోడీని తిడుతున్నప్పటికీ ఏపీ అభివృద్ధికి ప్రధాని కట్టుబడే ఉన్నారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు 100శాతం నిధులు మోడీ ప్రభుత్వం ఇస్తోందని, దేశంలో ఏ ప్రాజెక్టుకు కూడా ఇలా ఇవ్వలేదని అన్నారు. ఏపీ ప్రజలను అవమానపర్చే ఆలోచనే ఉంటే ఇలా చేసేవారమా? అని ప్రశ్నించారు.

ఏపీ కోసం 150శాతం

ఏపీ కోసం 150శాతం

కేంద్రం నుంచి డబ్బులు తీసుకుని అవినీతికి పాల్పడితే కేంద్రం సహించబోదని రాంమాధవ్ అన్నారు. ఏపీ ప్రజల హితం కోసమే బీజేపీ పనిచేస్తోందని అన్నారు. ఇప్పటికే 85శాతం వరకు ఏపీలో పనులు పూర్తి చేసిందని, ఏపీకి 100కాదు, 150శాతం సాయమందిస్తామని అన్నారు. రైల్వే జోన్ విషయంలోనూ కేంద్రం సానుకూలంగానే ఉందని అన్నారు.

ఎన్టీఆర్ ఆశయాలకు బాబు తూట్లు

ఎన్టీఆర్ ఆశయాలకు బాబు తూట్లు

గతంలో 37ఎంపీలున్న దేవేగౌడను ప్రధాని చేశారని, ఇప్పుడు 38ఎమ్మెల్యేలతో కుమారస్వామి సీఎం అయితే చంద్రబాబు ఆయనకు మద్దతు తెలిపారని అన్నారు. టీడీపీ అస్థిర ప్రభుత్వాలకు మద్దతు పలుకుతోందని అన్నారు. దేశం హితం కోసం పనిచేసే పార్టీలకు చంద్రబాబు కాలు అడ్డుపెడుతున్నారని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో వెళుతున్నారని, తూట్లు పొడుస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు.

అవినీతి, కుల రాజకీయాలు

అవినీతి, కుల రాజకీయాలు


ఎన్టీఆర్ నాన్ కాంగ్రెస్ పార్టీలకు మద్దతుగా ఉంటే.. చంద్రబాబు టీడీపీ మాత్రం అవినీతి, వంశపారంపర్య పాలన, కులరాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు
రాజకీయాల్లో జవాబుదారీతనం వదిలేసిన చంద్రబాబు.. కేంద్రాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ప్రజల సొమ్ముతో చంద్రబాబు అధర్మ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు.

టీడీపీ సంబరం.. కర్ణాటకలో జరిగిందే ఏపీలో..

టీడీపీ సంబరం.. కర్ణాటకలో జరిగిందే ఏపీలో..


కాంగ్రెస్, టీడీపీల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలన్నారు. 70ఏళ్ల సంస్కృతి కల బీజేపీ దేశం కోసం, ప్రజల కోసం పనిచేస్తూ వస్తోందని చెప్పారు. బీజేపీని ఎవరూ మార్చలేరని అన్నారు. దుష్టచరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీతో టీడీపీ కలుస్తోందని అన్నారు. జేడీఎస్-కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఏర్పడితే ఇక్కడ టీడీపీ సంకలు గుద్దుకుంటోందని, బీజేపీ ఓటమికి తామే కారణమని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. కర్ణాటకలో జరిగిందే ఏపీలో కూడా జరుగుతుందని రాంమాధవ్ అన్నారు.

 2019లో ఏపీలో బీజేపీ

2019లో ఏపీలో బీజేపీ

పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేసి టీడీపీకి, వైసీపీకి ధీటుగా బీజేపీని నిలబెట్టాలని రాంమాధవ్ పిలుపునిచ్చారు.2019లో ఏపీలో బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకొద్దామని అన్నారు. బీజేపీ, మోడీ దయతో టీడీపీ-బీజేపీ ప్రభుత్వం 2014లో ఏర్పడిందని అన్నారు. టీడీపీ పాలనలో అవినీతి, కులతత్వం పెరిగిపోయిందని రాంమాధవ్ విమర్శించారు.

వెంకటేశ్వరస్వామికీ కులమా?

వెంకటేశ్వరస్వామికీ కులమా?

వెంకటేశ్వరస్వామికి కూడా కులం అంటగట్టారని, ఆయన కూడా చౌదరేనట అంటూ చెప్పుకుంటున్నారని రాంమాధవ్ మండిపడ్డారు. నూతన ఏపీ నిర్మాణం కోసం ఇక్కడ కూడా బీజేపీ గెలవాలని అన్నారు. కన్నాకు పదవి ఇస్తే పలాన కులాన్ని గురించి ఇచ్చారంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. యోగ్యతను బట్టి ఇచ్చినా కులాన్ని చూస్తున్నారని, అది మారాలని అన్నారు. అన్ని కులాలు, మతాలకు చెందిన పార్టీ బీజేపీ అని రాంమాధవ్ చెప్పారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే నినాదంతో ముందుకెళ్తున్నామని చెప్పారు.

న్యూ పొలిటిక్స్ ఫర్ న్యూ ఏపీ

న్యూ పొలిటిక్స్ ఫర్ న్యూ ఏపీ

కుల రాజకీయాలు చేసేవారు తమను మతతత్వ పార్టీ అంటారా? అని రాంమాధవ్ మండిపడ్డారు. ఏపీలో నూతన రాజకీయ సంస్కృతిని తీసుకురావడానికి పాటుపడాలని అన్నారు. రాష్ట్రంలో అవినీతి, తప్పుడు పాలన, అబద్దపు ప్రచారానికి వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు ప్రజల్ని జాగృతం చేయాలని రాంమాధవ్ పిలుపునిచ్చారు. న్యూ పొలిటిక్స్ ఫర్ న్యూ ఏపీ అని నినదించారు. నాలుగేళ్ల మోడీ పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఏపీలో 2019లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా పెట్టుకోవాలని పార్టీ శ్రేణులకు రాంమాధవ్ పిలుపునిచ్చారు.

English summary
BJP leader Ram Madhav fired at TDP and Chandrababu naidu for allegations on his party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X