• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాతి బొమ్మలు పగిలితే ఇంత రచ్చా? తిరుమలలో రాయినే చూసొచ్చావా? -సీపీఐ నారాయణ vs బీజేపీ విష్ణు

|

ఆంధ్రప్రదేశ్‌లో హిందూ ఆలయాలపై వరుస దాడుల నేపథ్యం, తాజాగా విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత రామతీర్థం ఆలయంలో కోదండరాముడి విగ్రహ ధ్వంసం ఘటనలపై రాజకీయ పార్టీల మధ్య తీవ్ర విమర్శలు, ప్రతివిమర్శలు తారాస్థాయికి చేరాయి. రామతీర్థం ధ్వంసం వెనుక టీడీపీ కుట్ర దాగుందని వైసీపీ అధినేత, సీఎం జగన్ బాహాటంగా ఆరోపించారు. ఇదే అంశంపై సీపీఐ నారాయణ తీవ్ర విమర్శలు చేయగా, వాటిపై బీజేపీ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు.

  Chandrababu naidu Angry on ysrcp government over ramateertham incident

  సెక్సీ ఫొటోలతో హారిక వలపువల -డేటింగ్ పేరుతో భారీ చీటింగ్ -భర్త సిక్ - కుటుంబ పోషణకు పక్కదారి

  బొమ్మల తలలు పగిలితే రచ్చా?

  బొమ్మల తలలు పగిలితే రచ్చా?

  రామతీర్థం దేవతా విగ్రహాల ధ్వంసం, ఏపీలో ఆలయాలపై వరుస దాడుల నేపథ్యంలో సీపీఐ నారాయణ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఏనాడూ మత రాజకీయాలకు చోటు లేదని, కొత్తగా వాటిని రాష్ట్రానికి తీసుకు రావద్దంటూ.. అసలు రాతి బొమ్మల తలలు పగలగొడితే ఇంత రాజకీయం అవసరమా? రైతులు మరణిస్తే మాత్రం పట్టించుకోరుగానీ, బొమ్మలపై ఇంత చర్చ చేస్తారా? నేతలకు అసలు సిగ్గుందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నిరసనలను పక్క దారి పట్టించేందుకే బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇలాంటి మత సమస్యలు సృష్టిస్తున్నాయని, ఏపీలోనూ ఇప్పుడు ఓట్ల రాజకీయం నడుస్తోందని అన్నారు. కాగా,

  నారాయణపై విష్ణు ఫైర్..

  నారాయణపై విష్ణు ఫైర్..

  బొమ్మలతలలు అంటూ హిందూ దేవతామూర్తలను ఉద్దేశించి సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆయన పేరులోనే "నారాయణ(వెంకటేశ్వరస్వామి)" ఉందని తెలుసుకోవాలని హితవు పలికారు. సోమవారం మీడియాతో మాట్లాడిన విష్ణు.. నారాయణ పేరు కూడా ఆయన అంటున్న రాతి పేరేనని.. మరి ఆయన పేరు మార్చుకుంటారా? అని ప్రశ్నించారు. హిందూ దేవుళ్లను రాతి విగ్రహాలతో పోల్చి హిందువులను అవమానించే నారాయణ హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

  ఏపీలో బండి ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్? -ఢిల్లీలో సోము వీర్రాజు, సంజయ్ -నడ్డాతో కీలక భేటీ -వ్యూహాత్మకంగా

  తిరుమలలో రాతినే చూసొచ్చారా?

  తిరుమలలో రాతినే చూసొచ్చారా?

  ‘‘కమ్యూనిస్టు మాటలకు చేతలకు ఏనాడు పొంతన ఉండదు. గాంధీ జయంతి రోజే హింసా మార్గాన్ని ఎంచుకుని చికెన్ తిన్న నారాయణ.. కొన్నాళ్లకు యూటర్న్ తీసుకున్నాడు. ఆమధ్య కుటుంబంతో సహా నారాయణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇంతకీ ఆయన కుటుంబం తిరుమలో దైవాన్ని చూశారా? లేక రాతి బొమ్మనే చూశొచ్చారో, అసలు తిరుమలలో ఏముందో, నారాయణ కుటుంబం దర్శినానికి ఎందుకు వెళ్లిందో సమాధానం చెప్పాలి. ఈ కమ్యూనిస్టు పార్టీలకు, నారాయణలాంటి నేతలకు బొత్తిగా వయసైపోయింది..

  కమ్యూనిస్టులు.. కమ్యూనిష్టులు..

  కమ్యూనిస్టులు.. కమ్యూనిష్టులు..

  దేవుళ్లను అవమానించడం కమ్యూనిస్టులకు అలవాటుగా మారింది. మళ్లీ ఆ పార్టీల నేతలే దేవాలయాలను రక్షించమని ఉద్యమాలకు దిగుతారు. సీపీఐ నేత నారాయణ ఒకలా, సీపీఎం నేత రామకృష్ణ మరోలా మాట్లాడుతారు. దేవుళ్ళను రాతితో పోల్చే వీళ్లను కమ్యునిష్టులు అనాలి. దేవుళ్ళ గురించి మాట్లాడే అర్హత వీళ్లకుందా? ఒకాయనేమో నారాయణ (వెంకటేశ్వరుడు), ఇంకొకరేమో సీతరాం ఏచూరి (రాముడు), మరొకరేమో రామక్రిష్ణ( రాముడు, క్రిష్ణుడు).

  వీళ్లంతా పేర్లు మార్చుకుంటారా? రైతులను, వాళ్ళ జీవితాలను మార్చేందుకు ఉపకరించే వ్యవసాయ బిల్లుల్ని వ్యతిరేకించి, దళారుల ఉద్యమంతో చలికాచుకునే కమ్యూనిస్టులు రైతుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం'' అని విష్ణువర్ధన్‌రెడ్డి మండిపడ్డారు.

  English summary
  Amid attack on rama theertham temple, cpi leader narayana criticises political parties for ignoring farmers death and calss idols as dolls. regarding this, ap bjp leader vishnuvardhan reddy slamc cpi narayana
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X