ఏపీ రాజధానిపై కేసీఆర్ నిర్ణయం ఇదే; కన్నా లక్ష్మీనారాయణకు బీఆర్ఎస్ ఆహ్వానం: రావెల సంచలనం
ఏపీ బీఆర్ఎస్ నేత రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ ఏపీ రాజధానిపై కేసీఆర్ నిర్ణయం వెల్లడించారు. కన్నా లక్ష్మీనారాయణకు బీఆర్ఎస్ ఆహ్వానం పలుకుతుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బిజెపికి గుడ్ బై చెప్పడంతో ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో చేరుతారు అన్న అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఏ పార్టీ లో అయ్యాన చేరితే ఎలాంటి సమీకరణాలు ఉంటాయి అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

కన్నా లక్ష్మీనారాయణను బీఆర్ఎస్లోకి స్వాగతించిన రావెల కిషోర్ బాబు
కన్నా లక్ష్మీనారాయణ ఈ నెలాఖరులో టిడిపి తీర్థం పుచ్చుకుంటారని చెబుతున్నప్పటికీ, ఆయన మాత్రం తన నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తానని చెప్పడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక ఇదే సమయంలో ఏపీలో ఉన్న రాజకీయ పార్టీలతో పాటు, జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ సైతం కన్నా లక్ష్మీనారాయణ విషయంలో దృష్టి కేంద్రీకరించింది. కన్నా లక్ష్మీనారాయణను బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవాలని, బీఆర్ఎస్ తో కలిసి పని చేయాలని స్వాగతం పలికారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత రావెల కిషోర్ బాబు.

కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు
బిజెపి మతతత్వ పార్టీ అని, దానికి వ్యతిరేకంగా కేసీఆర్ పోరాటం చేస్తున్నారని పేర్కొన్న ఆయన రాబోయే రోజుల్లో బిజెపి కనుమరుగవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోము వీర్రాజు బిజెపిని సర్వనాశనం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో బిజెపిలో కన్నా లక్ష్మీ నారాయణతో కలిసి అనేక పోరాటాలు చేసామని రావెల కిషోర్ బాబు గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు కూడా బిఆర్ఎస్ లో కలిసి పని చేద్దాం రమ్మంటూ స్వాగతం పలికారు.

ఏపీలో రాబోయే రోజుల్లో కేసీఆర్ పర్యటన.. పొత్తులపైనా ఆసక్తికర వ్యాఖ్యలు
కెసిఆర్ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తారని, బీఆర్ఎస్ పార్టీ ఏపీలో కీలకంగా మారబోతోందని రావెల కిషోర్ బాబు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 స్థానాలలో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే పొత్తులు ఎవరితో ఉంటాయన్నది భవిష్యత్తులో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.

రాజధాని అదే .. బీఆర్ఎస్ నిర్ణయం ఇదే అన్న రావెల
గతంలో కేసీఆర్ తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మాణం చేసుకోవాలని చంద్రబాబుకు, జగన్మోహన్ రెడ్డికి సూచించారని రావెల కిషోర్ బాబు వెల్లడించారు. కెసిఆర్ మాటలు పెడచెవిని పెట్టడం వల్లే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం అయిందని ఆయన పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో రాజధాని అంశంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు రావెల కిషోర్ బాబు. అమరావతి రాజధానిగా ఉంచాలని బిఆర్ఎస్ పార్టీ నిర్ణయమని రావెల కిషోర్ బాబు వెల్లడించారు. త్వరలోనే మంగళగిరి ప్రాంతంలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ఆయన స్పష్టం చేశారు.

ఏపీలో యువత పరిస్థితి ఇలా..
ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉపాధి లేకుండా పోయిందని పేర్కొన్న ఆయన, ఒక చేత్తో సర్టిఫికెట్లు మరో చేత్తో పొట్ట పట్టుకొని ఏపీ యువత పొరుగు రాష్ట్రాలకు వెళుతున్న దుస్థితి నెలకొందని మండిపడ్డారు. ఏపీలో బి ఆర్ ఎస్ ఆ పరిస్థితులను మార్చడానికి పనిచేస్తుందని రావెల కిషోర్ బాబు వెల్లడించారు. తాజాగా బీఆర్ఎస్ నేత రావెల చేసిన వ్యాఖ్యలపై ఏపీలో ఆసక్తికర చర్చ జరుగుతుంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications