హైదరాబాద్‌లో కబ్జా: కోర్టులో లొంగిపోయిన జగన్ మేనమామ రవీంద్రనాథ్
కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గురువారం నాడు మియాపూర్ కోర్టులోని 25వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట లొంగిపోయారు.
ఓ భూవివాదానికి సంబంధించి పెండింగులో ఉన్న కేసులో హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చింది. రూ.లక్ష పూచీకత్తు, బెయిల్ పత్రాలను కోర్టుకు అందించారు.
ఈ కేసులో పోలీసులు గత నెల 13న ప్రతాప్ రెడ్డి, నర్సింహ రెడ్డి, రాజిరెడ్డిలని రిమాండుకు తరలించారు. సుధాకర్‌తో పాటు రవీంద్రనాథ్ రెడ్డి పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన కోర్టులో లొంగిపోయారు.

కాగా, మెహిదీపట్నంలోని సంతోష్ నగర్‌కు చెందిన దామరచెరువు ప్రమీలకు మాదాపూర్ ఖానామెట్ పరిధిలో ప్లాట్ ఉంది. ఇది 300 గజాల స్థలం. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో నివాసం ఉంటున్న కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ప్రతాప్ రెడ్డి, నర్సింహా రెడ్డి, హైదరాబాదుకు చెందిన రాజిరెడ్డి, కేపీహెచ్‌బికి చెందిన రాజిరెడ్డిలు నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలను సృష్టించి కబ్జా చేశారు.
రవీంద్రనాథ్ రెడ్డి అప్పట్లో రూ .25 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రమీల దీనిపై ప్రశ్నించగా.. ఆమెను బెదిరించారు. బాధితురాలు 2012 ఏప్రిల్ 7న మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగేళ్ల తర్వాత ఇటీవల పోలీసులు కొందర్ని అరెస్టు చేశారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి












Click it and Unblock the Notifications