రాయచోటికి మంత్రి మండిపల్లి బిగ్ రిలీఫ్..! మరో మంత్రి సాయంతో..!
ఏపీలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి, చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేస్తున్న కడప జిల్లా నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (mandipalli ramprasad reddy) తాజాగా తన రాయచోటి నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా కాపాడుకోలేకపోయారనే విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో తన నియోజకవర్గంలో ప్రజల్లో అసంతృప్తికి కారణమయ్యారు. కానీ మరో విషయంలో మాత్రం ఆయన రాయచోటి ప్రజల్ని మెప్పించారు. తన సహచర కేబినెట్ మంత్రితో కలిసి నియోజకవర్గానికి ఊరట కల్పించారు.
అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రాంత ప్రజలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల, స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ దృష్టికి మంత్రి మండిపల్లి తీసుకెళ్లారు. ఇందులో ముఖ్యంగా
గతంలో అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉన్న సమయంలో రిజిస్ట్రేషన్ విలువలను 200 నుంచి 300 శాతం వరకు పెంచారని, జిల్లా కేంద్రం మారినప్పటికీ అదే విలువలు కొనసాగడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా నష్టపోతున్నట్లు తెలిపారు. వాస్తవ భూమి విలువలకు మించి మార్కెట్ విలువలు నిర్ణయించడంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గిపోయిందన్నారు.

అలాగే ఫిబ్రవరి 1 నుంచి భూముల మార్కెట్ విలువను మరింత పెంచే ప్రతిపాదన అమలులోకి వస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని, దీని ప్రభావం ప్రజల ఆర్థిక స్థితిపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని మంత్రి మండిపల్లి తెలిపారు. కాబట్టి రాయచోటి ఎస్ఆర్వో పరిధిలో రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించడంతో పాటు, ప్రతిపాదన మార్కెట్ విలువ పెంపును నిలిపివేయాలని కోరారు. తద్వారా ప్రజలు, రియల్ ఎస్టేట్ రంగ ప్రయోజనాలు కాపాడాలని మంత్రి అనగానిని కోరారు. దీనిపై రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సానుకూలంగా స్పందించారు. తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications