వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బోర్డు తిప్పేసిన రియల్ సంస్థ, ఏజెంట్ సూసైడ్ యత్నం

By Srinivas
|
Google Oneindia TeluguNews

West Godavari
ఏలూరు: తక్కువ ధరలో ఇళ్లు కట్టిస్తామని చెప్పి కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ బోర్డు తిప్పేసింది. పశ్చిమ గోదావరి జిల్లా తుణుకులో విశాఖపట్నం కేంద్రంగా ప్రారంభమైన కోమలి రియల్ ఎస్టేట్ సంస్థ కోట్లాది రూపాయలు వసూలు చేసి పత్తా లేకుండా పోయింది.

విశాఖ, తణుకు, తూర్పు గోదావరి తదితర జిల్లాల్లో ఈ సంస్థకు బ్రాంచీలు ఉన్నాయి. ఈ సంస్థకు చెందిన ఏజెంట్లు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం తదితర ప్రాంతాల్లో తక్కువ ధరకు ఇళ్లు కట్టించి ఇస్తామని చెప్పా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు.

సంస్థ తరఫున సోమరాజు అనే ఏజెంట్ సుమారు 44 లక్షల రూపాయలు వసూలు చేసి సంస్థకు జమ చేశాడు. కొద్ది కాలంగా విశాఖపట్నం, తణుకులలో సంస్థ కార్యాలయాలు మూతపడి ఉండటంతో బాధితులు అతనిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో సోమరాజు ఆత్మహత్యాయత్నం చేశాడు.

అతను ముప్పై మంది నుండి డబ్బులు వసూలు చేశాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆసుపత్రిలో చేర్పించగా అక్కడి నుండి పరారయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. సంస్థ యజమాని శ్రీనివాస్‌గా తెలుస్తోంది. అతను ఏడాది క్రితం కోమలి రియల్ ఎస్టేట్ సంస్థను స్థాపించాడు.

English summary
Komali Real Estate Company cheated many people in Seemandhra region. Company agents collected crores of rupees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X