శబరిమలలో రెడ్ అలెర్ట్.. అయ్యప్ప భక్తులకు బిగ్ అలెర్ట్!!
కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురవడంతో వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నిన్న కేరళ రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లాకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఈ నేపధ్యంలో ప్రకృతి విపత్తులు సంభవించే ప్రమాదం కూడా ఉందని చెప్తున్నారు.
23, 24 తేదీలలో వర్షాలు కొనసాగే ప్రమాదం ఉందని, కొండ ప్రాంతాలలో పర్యటించే వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొండచరియలు విరిగిపడడం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో శబరిమల వెళ్ళే అయ్యప్ప స్వామి భక్తులకు కూడా అధికారులు కీలక ఆదేశాలను జారీ చేస్తున్నారు.

జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యంగా రాత్రి వేళల్లో శబరిమలకు వెళ్లే సమయంలో, తిరిగి ప్రయాణం చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని యాత్రికులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరోవైపు సహాయక బృందాలు అలర్ట్ గా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన అధికారులు, శబరిమలకు వెళ్లే భక్తులు భారీ వర్షాల నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
శబరిమలలో మండల మకర విళక్కు ఉత్సవాల నేపథ్యంలో భక్తులు పోటెత్తుతున్నారు.ప్రస్తుతం మండల పూజలో భాగంగా డిసెంబర్ 27వ తేదీ వరకు స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించారు. మకరజ్యోతికి ఇక డిసెంబర్ 31వ తేదీ నుంచి వచ్చే సంవత్సరం జనవరి 15వ తేదీ వరకు అయ్యప్ప స్వామి వారికి మకర జ్యోతి పూజలు కొనసాగుతాయి.
మకర సంక్రాంతి రోజున సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు మకర జ్యోతి దర్శనంతో వార్షిక ఉత్సవాలు పతాక స్థాయికి చేరుకుంటాయి. అత్యంత ఘనంగా అయ్యప్ప వార్షిక వేడుకలు జరుగుతాయి. కాగా ప్రస్తుతం రెండు నెలల పాటు జరిగే వార్షిక మండలం-మకరవిళక్కు వేడుకల తీర్థయాత్రలో భాగంగా పతనంతిట్ట జిల్లాలోని శబరిమలలోని అయ్యప్ప స్వామి కొండపైకి వెళ్లే వేలాది మంది భక్తులకు భారీ వర్షం తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది.












Click it and Unblock the Notifications