ఏపీ-తెలంగాణలో ఓట్లపై ఈసీ సీరియస్-కలెక్టర్లకు కీలక ఆదేశాలు..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. నాలుగు నెలల్లో ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు కలిగిన వారి వ్యవహారం కలకలం రేపుతోంది. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు... తిరిగి ఏపీకి వచ్చి ఇక్కడా ఓటు వేసేందుకు ప్రయత్నిస్తున్న వ్యవహారంపై అధికార వైసీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈసీకి వరుస ఫిర్యాదులు చేస్తోంది.

వీటిపై స్పందించిన ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా ఇవాళ జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏపీ, తెలంగాణ రెండు చోట్లా ఉన్న ఓట్లను కలెక్టర్లు పరిశీలించాలని ఆయన కలెక్టర్లకు సూచించారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై, రెండు చోట్లా ఓట్లు కలిగి ఉండటంపై వైసీపీ తాజాగా చేసిన ఫిర్యాదు మేరకు సీఈవో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని వైసీపీకి అధికారికంగా తెలియజేశారు. దీంతో ఇప్పుడు కలెక్టర్లు ఏం చేయబోతున్నారనేది కీలకంగా మారింది.

relief to ysrcp as EC orders collectors to inquire about multiple votes in telugu states

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉండటం వల్ల ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుందని, ఎన్నికల ప్రక్రియలో అక్రమాలకు తావిచ్చినట్లు అవుతుందని వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల తర్వాత హైదరాబాద్ లోని కూకట్ పల్లి ప్రగతి నగర్ లో శిబిరాలు ఏర్పాటు చేసి మరీ ఏపీ ఓట్లను నమోదు చేయించే ప్రక్రియ బహిరంగంగా చేపట్టడంపై వైసీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈసీని ఆశ్రయించింది. దీనిపైనా ఈసీ విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో ఓట్ల తొలగింపుతో పాటు కొత్త ఓట్ల నమోదుపైనా టీడీపీ, వైసీపీ ఫిర్యాదుల నేపథ్యంలో ఈసీ ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

సీఈవో తాజా ఆదేశాల ప్రకారం హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులో ఓటు ఉన్నవారికి చెక్ పడబోతోంది. ఒక వ్యక్తికి ఒకే నియోజకవర్గం, ఒకే రాష్ట్రంలో ఓటు ఉండాలని సీఈవో ముకేష్ మీనా కలెక్టర్లకు సూచించారు. ఒక వ్యక్తికి ఎక్కువ చోట్ల ఓటు ఉండటం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఫామ్‌ -6 ద్వారా కొత్త ఓటు నమోదు మాత్రమే చేయాలన్నారు. కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు డిక్లరేషన్ తీసుకోవాలన్నారు. వేరే ఎక్కడ ఓటు లేదని డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. తప్పుడు డిక్లరేషన్ ఇచ్చే వారిపై కేసులు పెట్టాలన్నారు. తప్పుడు డిక్లరేషన్‌తో ఓటు నమోదు దరఖాస్తు చేస్తే జైలు శిక్ష విధించాలని ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+