మంగళగిరి మండలం ఆత్మకూరులో ఆక్రమణల తొలగింపు..బాధితుల ఆందోళనతో ఉద్రిక్తత
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ఉద్రిక్తతలకు కారణమైంది . అక్రమ నిర్మాణాల పేరుతో కొన్ని నివాసాలను అధికార యంత్రాంగం ఈరోజు ఉదయం కూల్చి వేసింది. బాధితులు అడ్డుకుంటున్నా పోలీసుల సహాయంతో రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం, పొక్లెయిన్ ల సహాయంతో కొన్ని నివాసాలను కూల్చివేశారు.
రెవెన్యూ అధికారులు, భారీ పోలీసు బలగాలతో బలవంతంగా ఇళ్ళు ఖాళీ చేయిస్తూ కూల్చివేతలకు దిగడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

గత నలభై సంవత్సరాలుగా తాము అక్కడ నివాసం ఉంటున్నామని, నిర్మాణాలకు సంబంధించిన కేసు న్యాయస్థానంలో విచారణ లో ఉండగానే అధికారులు అక్రమ కూల్చివేతలకు దిగారని బాధితులు ఆరోపిస్తున్నారు. అసలు ఇళ్ళ స్థలాలను కేటాయించకుండా కట్టడాలను ఎలా కూల్చేస్తారు అంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు.
అధికారుల తీరుతో బాధితులు ఆందోళనకు దిగారు. బాధితులకు తెలుగుదేశం పార్టీ నాయకులు , వామపక్ష నేతలు మద్దతుగా నిలిచారు. బాధితులకు ప్రత్యామ్నాయ స్థలాలు చూపించిన తర్వాత వారితో ఇళ్లను ఖాళీ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు కోర్టులో కేసు విచారణలో ఉన్న సమయంలో అధికారులు ఈ విధంగా చేయడం సమంజసం కాదని అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications