రేణుదేశాయ్ పోస్ట్.. మళ్ళీ మొదలైన రేణు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వార్!!

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా సోషల్ మీడియా లో పెట్టిన ఒక పోస్ట్ రేణు దేశాయ్ ఫాన్స్, పవన్ ఫాన్స్ మధ్య రచ్చకు కారణమైంది. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన కాలికి బలమైన గాయాలు తగలడంతో ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోను షేర్ చేశారు.

ఆ వీడియోలో నా కుడి పాదానికి చాలా పెద్ద గాయమైందని, మూడు వేళ్ళకు దెబ్బ తగిలిందని, ఒక వేలు బాగా నలిగిపోయి, గోరు బయటకు వచ్చేసిందని కానీ అంత బాధలోనూ నేను ఒంటరిగా సముద్రాన్ని ఆస్వాదిస్తున్నాను అంటూ సోషల్ మీడియాలో తాను ఒంటరిగా సముద్రపు అలల మధ్య నడుస్తున్న వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో ఆగి ఆగి సాగి మేఘమే నన్ను తాకెనా అంటూ ఒక పాటను కూడా జతచేశారు.

pawanrenudesai

అయితే రేణుదేశాయ్ చేసిన తాజా పోస్టుతో పవన్ కళ్యాణ్ ప్రస్తావన మళ్ళీ తెరమీదకు వచ్చింది. ఈ పోస్ట్ పై రేణుదేశాయ్ కు మద్దతుగా నిలిచే, పవన్ కళ్యాణ్ ను ఇష్టపడనివారు వాడేమో ఇంకో పెళ్లి చేసుకుని సరదాగా జీవితం గడిపేస్తున్నాడు. వాడిని నమ్ముకున్న మీరు మాత్రం ఇలా ఒంటరిగా భరిస్తున్నారు అంటూ కామెంట్ చేశారు.

మరికొందరు కాలికి గాయం అయినప్పుడు ఉప్పు నీళ్లలో తిరగడం మంచిది కాదని, రేణుదేశాయ్ కు జాగ్రత్తలు చెప్పారు. ఇంకొందరు పవన్ కళ్యాణ్ వల్ల రేణుదేశాయ్ పరిస్థితి ఇలా అయింది అంటూ ఆమెపై సానుభూతిని వ్యక్తం చేశారు. ఇక రేణుదేశాయ్ పోస్టుకు పవన్ కళ్యాణ్ పై వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిపై, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు.

వాడు వీడు ఏంటి.. వదిలేయడం కంటే వెళ్ళగొట్టడమే బెటర్ మీ వెర్షన్లలో.. అయినా ఇక్కడ వాళ్ల పర్సనల్ మేటర్ అవసరమా.. వాళ్ళ మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంది. మీరు ఎందుకు బాధ పడుతున్నారు అంటూ ప్రశ్నించారు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ మీద పడి ఏడవడమేనా మీ పని అంటూ పవన్ హేటర్స్ పై పవన్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు.

ఇక మరికొందరు రేణుదేశాయ్ పెట్టిన పోస్ట్ కు ఆమె సముద్ర అలల మధ్య నడుస్తూ పెట్టిన వీడియో బద్రి సినిమా లోని బంగాళాఖాతంలో పాట పెడతే బాగుండేది అంటూ ఆమెపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రేణు దేశాయ్ ఆ పోస్టు పెట్టకపోతే పవన్ కళ్యాణ్ ను ఎవరు టార్గెట్ చేసేవారు కాదని, ఆమె పోస్టులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వ్యవహారం రచ్చ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+