అమరావతి.. బాహుబలి 2 గ్రాఫిక్స్‌లా: రోజా, 'జబర్దస్త్'ను లాగిన టిడిపి

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని డిజైన్లపై ప్రభుత్వం శాస‌న‌స‌భ‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడంపై వైసిపి ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. ఈ ప్ర‌జెంటేష‌న్‌ను రోజా బాహుబ‌లి సినిమా గ్రాఫిక్స్‌తో పోల్చారు.

ఆ చిత్రంలో చూపించిన గ్రాఫిక్స్‌లా ఈ ప్ర‌జంటేష‌న్‌ను చూపించి ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతోంద‌న్నారు. ఇంకా ఖరారు కాని డిజైన్లను శాస‌న‌స‌భ‌లో చూపించడం ఏమిటని ప్ర‌శ్నించారు.

ప్ర‌భుత్వం చూపిస్తోన్న‌ డిజైన్లలో 51శాతం గ్రీనరీకి ప్రాముఖ్యతనిస్తామ‌ని చెబుతున్నారని, అయితే, మూడు పంటలు పండే భూముల్ని దోచుకుని వాటిని సర్వ నాశనం చేసి, ఆ స్థానంలో ప్లాస్టిక్ మొక్కలను మొలిపిస్తామనేలా మాట్లాడుతున్నార‌న్నారు.

రాజధాని నిర్మాణం విషయంలో చంద్రబాబు ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారన్నారు. రాజధానిని ఎంపిక చేసేటప్పుడు గానీ, రైతుల భూములు లాక్కునేటప్పుడు గాని, రైతులకు ప్యాకేజీ ఇచ్చే సమయంలో గానీ, సింగపూర్ సంస్థతో సీల్డ్ కవర్లో ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు గానీ అఖిల పక్షాన్ని ఏర్పాటు చేశారా అని నిలదీశారు.

Roja compares Amaravati designs with Bahubali graphics

సభా సమయాన్ని వృధా చేసి బాహుబలి 1, 2 లాగా గ్రాఫిక్స్‌లో రాజధానిని నిర్మిస్తున్నారన్నారు. అధికార పార్టీ అసెంబ్లీ సమయాన్ని వృధా చేసి చంద్రబలి సినిమా చూపిస్తోందని చెవిరెడ్డి భాస్కర రెడ్డి అన్నారు.

యరమపతినేని ఎద్దేవా

జబర్దస్త్‌లో వేసినట్లు డ్రామాలాడడం తమకు తెలియదని టిడిపి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు.. రోజాకు కౌంటర్ ఇచ్చారు. రాజధాని నిర్మాణంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను సినిమాతో పోల్చడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాలకు మధ్యలో ఉన్న చోట రాజధాని నిర్మాణం వైసిపి నేతలకు ఇష్టం లేదని, ఇడుపులపాయలోని వైయస్ సమాధి పక్కనే రాజధాని కడితే వీరికి ఆనందమన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress Party MLA Roja compares Amaravati designs with Bahubali graphics.
Please Wait while comments are loading...