ఆఫీస్‌లోకి నీళ్లు: విద్యుత్ షాక్ ట్విస్ట్, జగన్ ప్రాణాలకే ప్రమాదమని..

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: నవ్యాంధ్ర అసెంబ్లీలోని వైసిపి అధినేత జగన్ కార్యాలయంలోకి నీరు రావడంపై ఇటీవల జోరుగా చర్చ సాగుతోంది. భారీ అవినీతితో నిర్మించిన భవనాల డొల్లతనం బయటపడిందని వైసిపి చెబుతోంది.

జగన్ ఆఫీస్‌లోకి నీరు: విచారణలో వేలు వారివైపు.. ఆసక్తికర కోణాలు, వైసిపి కొత్త ట్విస్ట్

అయితే, వైసిపికి చెందిన వారు పైప్ కోయడం వల్ల జగన్ కార్యాలయంలోకి నీరు వచ్చిందని టిడిపి, ప్రభుత్వం చెబుతోంది. ఇదంతా కుట్ర అని ఆరోపిస్తున్నారు. మొత్తానికి వర్షం వల్ల నీరు రావడంపై టిడిపి, వైసిపి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

నిన్న రోజా సంచలన వ్యాఖ్యలు

నిన్న రోజా సంచలన వ్యాఖ్యలు

రెండు రోజుల క్రితం వైసిపి ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కార్యాలయంలోకి నీరు రావడాన్ని ఆమె కూడా కుట్రగా అభివర్ణించారు. మరో అడుగు ముందుకేసి తమ పార్టీ అధినేత ప్రాణాలకే ప్రమాదమని చెప్పారు.

జగన్ ప్రాణాలకు ప్రమాదమని ట్విస్ట్

జగన్ ప్రాణాలకు ప్రమాదమని ట్విస్ట్

వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు ప్రమాదం ఉందని రోజా అనుమానాలు వ్యక్తం చేశారు. జగన్ కార్యాలయంలోకి నీరు రావడం వల్ల విద్యుత్ షాక్‌కు ఆస్కారం ఉందని, కాబట్టి ఆయన ప్రాణాలకు ప్రమాదమని, ఇందులో కుట్ర ఉందని ఆమె అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం. ఏం జరిగినా ఆ తప్పును జగన్ పైకి నెట్టివేయడం టిడిపికి అలవాటుగా మారిందని ఆమె ఎద్దేవా మండిపడ్డారు.

సోషల్ మీడియాలోను..

సోషల్ మీడియాలోను..

ఇదిలా ఉండగా, జగన్‌తో పాటు సోషల్ మీడియాలోను ఈ రగడపై చర్చ సాగుతోంది. రెండు రోజుల క్రితం వరకు సోషల్ మీడియాలో ఇది నానింది. సిబిఐ దర్యాఫ్తులో విద్యుత్ అధికారులు కూడా పాలుపంచుకున్నారని, కావాలనే ఎవరో కుట్ర ప్రకారం జగన్ కూర్చుండే సీటు దాకా భారీ షార్ట్ సర్క్యూట్ అయ్యేటట్లు ప్లాన్ చేశారని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనిన్ని అమలు చేయాలనుకున్నట్లు కనిపిస్తోందని సందేహాలు వ్యక్తం చేశారని, దీంతో ఈ కుట్ర వైసిపి వైపు మళ్లేలా చూడాలని సిఐడీని ప్రభుత్వం ఆదేశించినట్లు ఓ ప్రచారం చేశారు.

టిడిపి బద్నాం వాదన

టిడిపి బద్నాం వాదన

టిడిపి మాత్రం వైసిపి వాదనలకు భిన్నంగా స్పందిస్తోంది. ప్రభుత్వం నిర్మాణాలు బాగా చేసినా, బద్నాం చేసేందుకే ఉద్దేశ్యపూర్వకంగా పైపు కట్ చేసి జగన్ కార్యాలయంలోకి నీళ్లు పోయేలా చేశారని, అసలు మిగతా కార్యాలయాల్లోకి నీళ్లు వెళ్లకుండా ఒక్క జగన్ కార్యాలయంలోకి ఎందుకు వెళ్లాయని ప్రశ్నిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSRCP MLA Roja suspected threat to the life of Jagan Mohan Reddy while pointing to possible electrical short circuit because of water seepage.
Please Wait while comments are loading...