రోజా వర్సెస్ బుద్దా వెంకన్న... మాటల యుద్ధం

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: ఏపీలో అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందన్న వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యలను టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తిప్పికొట్టారు.

జగనే దేశంలో పెద్ద అవినీతిపరుడంటూ ఆయన కౌంటర్ ఇచ్చారు. అలాగే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యలపై కూడా బుద్దా వెంకన్న స్పందించారు. మిత్రపక్ష విమర్శలను తీవ్రంగా తీసుకోబోమని వ్యాఖ్యానించారు.

రోజా ఏమన్నారంటే...

''రాష్ట్రంలో ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. మహిళలపై దాడులు జరిగితే మహిళా మంత్రులు కూడా పట్టించుకోవడంలేదు. అవినీతిపై సీఎం చంద్రబాబు ఒక్క మీటింగ్ పెడితే సరిపోదు, ఏడాదిపాటు ప్రతిరోజు పెట్టినా సరిపోతుందోలేదో!’’

బుద్దా వెంకన్న స్పందన ఇదీ...

''రాష్ట్రంలోనే కాదు దేశంలో నిజాయితీకి మారుపేరు చంద్రబాబు నాయుడు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డే. ముఖ్యమంత్రిపై రోజుకొక అబద్ధం మాట్లాడుతున్నారు. డబ్బులిచ్చి జనాలను తీసుకొచ్చి, అందులో ఒకరిద్దరికి ట్రైనింగ్ ఇచ్చి మరీ చంద్రబాబుపై అవాకులు, చెవాకులు చెప్పిస్తున్నారు. బీజేపీ మా మిత్రపక్షం. సోదరులు ఏదైనా అన్నా దాన్ని చిరునవ్వుతో స్వాగతిస్తాం.’’

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In andhra pradesh politics.. the war of words is continuing between opposition leaders and tdp leaders. In latest, TDP MLC Budda Venkanna countered YCP MLA RK Roja's comments here in Vijayawada on Thursday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి