వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్యపై అనుమానంతో ఆమె కాలు, చెయ్యి నరికేసిన భర్త ఆపై .. కడప జిల్లాలో ఓ భర్త శాడిజం

|
Google Oneindia TeluguNews

నిత్యం చోటుచేసుకుంటున్న అనేక సంఘటనలు మనం నాగరిక సమాజంలో ఉన్నామా? ఆటవిక రాజ్యంలో ఉన్నామా అన్న అనుమానాలకు కారణమవుతున్నాయి. ఎక్కడో ఒక చోట అందరూ షాక్ అయ్యేలా జరుగుతున్న అమానుష ఘటనలు అందుకు అద్దం పడుతున్నాయి. మొన్నటికి మొన్న మగబిడ్డను కనలేదని ఓ భర్త భార్యపై సలసలకాగే వేడి నీళ్ళు పోసిన ఘటన ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ఇప్పుడు తాజాగా ఓ భర్త భార్యపై అనుమానంతో ఆమె కాలు, చెయ్యి నరికేశాడు.

సంసారంలో చిచ్చు పెట్టిన అనుమానం

సంసారంలో చిచ్చు పెట్టిన అనుమానం


అనుమానం పచ్చటి కాపురంలో చిచ్చు పెట్టింది. అన్యోన్యంగా బ్రతుకుతున్న భార్యాభర్తల మధ్య అగాధాన్ని సృష్టించింది. గొడవలకు కారణమైంది. అంతేకాదు క్షణికావేశంలో భర్త చేసిన పని భార్యను ఆసుపత్రి పాలు చేసింది. కడప జిల్లాలో జరిగిన భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణ దారుణ ఘటనకు కారణమైంది. కడప జిల్లా చక్రాయపేట మండలం బి.ఎన్ తండాలో చోటు చేసుకున్న దారుణ సంఘటన లో భార్య మీద అనుమానంతో భర్త నిత్యం ఆమెతో గొడవకు దిగేవాడు. క్షణికావేశంలో భార్యపై కొడవలితో దాడి చేసి ఆమె కాలు చెయ్యి నరికేశాడు.

 భార్యపై అనుమానంతో ఘర్షణ .. కొడవలితో కాలు, చెయ్యి నరికేసి ఆపై

భార్యపై అనుమానంతో ఘర్షణ .. కొడవలితో కాలు, చెయ్యి నరికేసి ఆపై

ఇస్లావత్ నాగ నాయక్, ఈశ్వరమ్మ లకు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఎంతో అన్యోన్యంగా సాగిన వారి కాపురంలో అనుమానం చిచ్చు పెట్టింది. భార్యపై అనుమానంతో భర్త నాగ నాయక్ శాడిస్ట్ లా మారాడు. ఆమెను నిత్యం అనుమానంతో వేధించసాగాడు. దీంతో బుధవారం ఇద్దరూ గొడవ పడ్డారు. ఈ గొడవలో క్షణికావేశంతో నాగ నాయక్, ఇన్ని సంవత్సరాల నుంచి తనతో కలిసి జీవనం సాగిస్తున్న భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఇంట్లో ఉన్న కొడవలిని తీసుకొని భార్య చేతిపై, కాలిపై నరకడంతో ఆమె కాలు, చెయ్యి రెండు తెగిపడ్డాయి. ఇక ఆపై ఏం చేయాలో అర్థం కాని టెన్షన్ లో భర్త నాగ నాయక్ అక్కడి నుండి పరారయ్యాడు.

బాధితురాలిని ఆస్పత్రిలో చేర్చిన బంధువులు .. దర్యాప్తు చేస్తున్న పోలీసులు

బాధితురాలిని ఆస్పత్రిలో చేర్చిన బంధువులు .. దర్యాప్తు చేస్తున్న పోలీసులు

భర్త చేసిన దారుణమైన పనితో కాలు, చెయ్యి రెండు తెగిపోగా తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న బాధితురాలిని బంధువులు వేంపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. భార్యపై భర్త విచక్షణారహితంగా దాడి చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి గాలింపు చేస్తున్నారు.

అనుమానం, క్షణికావేశం నేరం చెయ్యటానికి కారణాలు

అనుమానం, క్షణికావేశం నేరం చెయ్యటానికి కారణాలు

భార్య భర్తల సంసారం అన్యోన్యంగా సాగాలంటే వారి మధ్య కావలసింది ఒకరిపై ఒకరికి నమ్మకం, అంతే గౌరవం. భార్య పై నమ్మకం లేకపోవడంతోనే భర్త అనుమానంతో బాధపడుతూ భార్యను బాధించాడు. అంతేకాదు క్షణికావేశంలో చేయకూడని పని చేసి సంసారాన్ని చిన్నాభిన్నం చేసుకున్నాడు. తాను సంతోషంగా లేడు, ఆమెను సంతోషంగా జీవించకుండా చేసి ప్రశ్నార్ధకంగా మారిపోయాడు. నాగ నాయక్ లాంటి వ్యక్తులు ఎంతోమంది భార్యపై అనుమానంతో వారిని అత్యంత దారుణంగా హత మారుస్తున్నారు. స్వతహాగా నేరప్రవృత్తి ఉన్నవారు కానప్పటికీ, క్షణికావేశంలో విచక్షణారహితంగా దాడులకు దిగుతున్నారు. పర్యవసానంగా నిండు ప్రాణాలు గాలిలో కలిసి పోవడమో, లేక గాయాలపాలై ఆసుపత్రుల పాలుకావడమో సంభవిస్తుంది.

Recommended Video

'Father Knows Who The Father Is' - TMC MP Nusrat Jahan || Oneindia Telugu
భార్యాభర్తల మధ్య ఘర్షణలకు పిల్లలు బలి

భార్యాభర్తల మధ్య ఘర్షణలకు పిల్లలు బలి

ఏది ఏమైనా అనుమానం అనే పెనుభూతం సంసారాలను విచ్ఛిన్నం చేస్తున్న అనేక సంఘటనలు ఇప్పుడు సమాజానికి హానికరంగా మారాయి. ఇదిలా ఉంటే మహిళా రక్షణ కోసం గృహహింస చట్టాలు ఎన్ని వచ్చినా మహిళలు నేటికీ గృహ హింసకు గురి అవుతూనే ఉన్నారు అని చెప్పడానికి ఇలాంటి అనేక ఘటనలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. భార్య మీద అనుమానాలతో కొట్టడం, తిట్టడం, వేధించడం, చిత్రహింసలకు గురి చేయడం చేస్తున్న ఎంతో మంది భర్తలు తమ బిడ్డలను, వారి భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారు. వారి మనసులపై మానని గాయాలకు కారణమవుతున్నారు.

English summary
In BN Tanda, Chakrayapeta Mandal, Kadapa district, the husband always got into a fight with his wife on suspicion. In a flash, he attacked his wife with a machete and chopped off her leg and hand. And then he fled. Relatives rushed the injured wife to hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X