సలార్ విడుదల వాయిదా.. ప్రభాస్ స్థానంలో రవితేజ

రెబల్ స్టార్ ప్రభాస్ తాజా సంచలనం సలార్ సెప్టెంబరు 28వ తేదీన విడుదల కానుందనే సంగతి తెలిసిందే. అయితే విడుదల తేదీపై ముందునుంచి అనుమానాలు వ్యక్తమయ్యాయి. వాటిని నిజం చేస్తూ సలార్ వాయిదా పడింది. సెప్టెంబరు 28వ తేదీకి బదులుగా డిసెంబరు 14వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

సెప్టెంబరు నెలలో సినిమా విడుదలవ్వాలంటే అందుకు ముందుగానే ట్రైలర్ విడుదలతోపాటు ఇతర ప్రమోషన్ కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా జరగాల్సి ఉంది. కానీ ఇంతవరకు వీటి చడీ చప్పుడు లేదు. దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా కంటెంట్ పై దృష్టి సారించారని, సీజీ వర్క్ కూడా ఇంకా పూర్తికాలేదని తెలుస్తోంది. వ్యాపార పరంగా చూసుకున్న నిర్మాతలు ఆశించిన స్థాయిలో జరగలేదని తెలుస్తోంది.

salaar postponed will release december 14th

ఏదేమైనప్పటికీ ఏకంగా సినిమాను రెండు నెలలు వాయిదా వేయడం అంతే యూనిట్ ఎంత సీరియస్ గా పనిచేస్తుందో అర్థమవుతోంది. ఆదిపురుష్ సినిమాతో పూర్తిగా నిరాశ చెందిన డార్లింగ్ అభిమానులకు ఈ సినిమా వాయిదా పడటం మరింత నిరాశపరుస్తోంది. సలార్ వాయిదా పడటంతో కొన్ని సినిమాలను విడుదల చేయాల్సిన నిర్మాతలు కూడా తమ ఆలోచనను మార్చుకుంటున్నారు. అక్టోబరు 20వ తేదీన రావాల్సిన టైగర్ నాగేశ్వరరావు సెప్టెంబరు 28వ తేదీన విడుదల కాబోతోంది.

అలాగే మరికొన్ని సినిమాలు విడుదల తేదీల్లో మార్పులు చేసే అవకాశం కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న సలార్ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం సలార్ సీజ్ ఫైర్ తాజా డిసెంబరు 14వ తేదీకి వెళ్లిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+