చంద్రబాబు ధైర్యానికి సెల్యూట్, బీజేపీకి చుక్కలే!: టీడీపీ ఎఫెక్ట్, నితీష్‌కు చిక్కులు

Posted By:
Subscribe to Oneindia Telugu

పాట్నా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ధైర్యానికి శాల్యూట్ అని, ఆయనను బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆదర్శంగా తీసుకోవాలని ఆర్జేడీ జాతీయ అధికార ప్రతినిధి మనోజ్ ఝా గురువారం అన్నారు.

చదవండి: ప్రభావం ఉండదు: బాబుకు పురంధేశ్వరి దిమ్మతిరిగే కౌంటర్, మోడీకి ఘాటుగా మోహన్ బాబు

బీహార్‌కు ప్రత్యేక హోదాపై నితీష్ ఇకనైనా గళం విప్పాలని ఆర్జేడీ సవాల్ విసిరింది. హోదాపై నితీష్ మాట్లాడకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు ప్రారంభిస్తామని హెచ్చరించింది. ఏపీకి హోదా అంశంపై చంద్రబాబు తన వైఖరికి కట్టుబడి కేంద్ర కేబినెట్ నుంచి తన మంత్రులతో రాజీనామా చేయించారన్నారు.

చదవండి: బాబు బయటకు, మోడీకి గడ్డుకాలం, నిజస్వరూపం బయటపడింది: శివసేన

తెలంగాణ ఏర్పాటుతో ఏపీకి, జార్ఖండ్‌తో బీహార్‌కు

తెలంగాణ ఏర్పాటుతో ఏపీకి, జార్ఖండ్‌తో బీహార్‌కు

తెలంగాణ ఏర్పాటు వల్ల ఏపీకి ఎంత నష్టం జరిగిందో జార్ఖండ్ ఏర్పాటుతో బీహార్‌కు అలాగే నష్టం జరిగిందని, కానీ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోందని ఆర్జేడీ నేత మనోజ్ ఝా అన్నారు.

నితీష్ హోదా కోసం డిమాండ్ చేయాలి

నితీష్ హోదా కోసం డిమాండ్ చేయాలి

నితీష్ కుమార్ గతంలో హోదా కోసం డిమాండ్ చేశారని, అసెంబ్లీ ఎన్నికల్లో దీనిని అంశంగా చేర్చారని, అయితే ఆయన మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోయిందని మనోజ్ అన్నారు. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాలతో మాట్లాడాలంటేనే నితీష్ వణికిపోతున్నారన్నారు.

నితీష్ భయపడుతున్నారు

నితీష్ భయపడుతున్నారు

తమతో తెగదెంపులు చేసుకొని బీజేపీతో జతకట్టినప్పటి నుంచి ఆయన ఓ రకమైన భయంతో బతుకుతున్నారని, హోదా గురించి మాట్లాడకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు. హోదా అంశంపై గురువారం అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టామని, సమాధానం రాకుంటే ఆందోళనలేనని హెచ్చరించారు.

టీడీపీయే కాదు, ఇతరులు అసంతృప్తి

బీజేపీ కారణంగా కేవలం తెలుగుదేశం పార్టీనే కాదని, మిగతా మిత్రపక్షాలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నాయని సదరు ఆర్జేడీ నేత చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి దేశవ్యాప్తంగా మహా కూటమి ఏర్పడుతుందని చెప్పారు. బీజేపీని అడ్డుకుంటామని అభిప్రాయపడ్డారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The opposition RJD in Bihar on Thursday challenged Chief Minister Nitish Kumar to take a cue from his Andhra Pradesh counterpart Chandrababu Naidu and "speak up" on the issue of special status for the state.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి